Begin typing your search above and press return to search.

'రాంగ్ రూట్'లో కారుతో పట్టుబడిన స్టార్ హీరో.. హెచ్చరించిన పోలీసులు!

By:  Tupaki Desk   |   4 March 2021 3:11 PM GMT
రాంగ్ రూట్లో కారుతో పట్టుబడిన స్టార్ హీరో.. హెచ్చరించిన పోలీసులు!
X
సినీతారలు అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులకు పట్టుబడుతుంటారు. మరి అవసరానికో లేక కావాలని వేగంగా వెళ్లడమో.. ఏదో విధంగా అప్పుడప్పుడు సెలబ్రిటీలు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి కెమెరా కంటపడి వార్తలలో నిలుస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు మలయాళం యువహీరో దుల్కర్ సల్మాన్. ఇటీవల దుల్కర్ ట్రాఫిక్ నియమాలు పక్కనపెట్టి రాంగ్ రూట్ లో సిగ్నల్ కోసం ఎదురుచూస్తూ పోలీసులకు చిక్కాడు. కేరళలో సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న హీరో దుల్కర్ సల్మాన్ బ్లూ కలర్ పోర్స్చే కారును తప్పుగా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ వీడియోలో ట్రాఫిక్ పోలీసు దుల్కర్ దగ్గరకు వెళ్లి హెచ్చరించారు. దుల్కర్ లైన్ క్రాస్ చేసి రావడం వలన కారును రివర్స్ తీసుకోవాలని చెప్పడంతో.. మొదట్లో బలవంతం చేసి తర్వాత తన తప్పు అంగీకరించాడట దుల్కర్.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్ -19 లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి దుల్కర్ కేరళలో ఉన్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దుల్కర్.. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దుల్కర్ ప్రస్తుతం తనరాబోయే మలయాళ చిత్రం 'కురుప్' విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. శ్రీనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. సుకుమారా కురుప్ అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుందట. ఈ సినిమాలో దుల్కర్ ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత దుల్కర్ డైరెక్టర్ శ్రీనాథ్ తో సినిమా చేసాడు. వీరిద్దరూ కలిసి దుల్కర్ ఫస్ట్ మూవీ 'సెకండ్ షో'కోసం వర్క్ చేశారు. అలాగే దుల్కర్ ప్రస్తుతం హే సినామిక మూవీ కంప్లీట్ చేసాడట. అంతేగాక హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.