Begin typing your search above and press return to search.
స్టార్ హీరో మరో చిత్రాన్ని ఫైనల్ స్టేజీకి తీసుకొచ్చారు..!
By: Tupaki Desk | 11 July 2021 6:00 AM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ విభిన్నమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'అసురన్' సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ధనుష్.. 'కర్ణన్' సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ధనుష్ తన 43వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో 'మాస్టర్' బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. యువ దర్శకుడు కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ '#D43' సినిమాని నిర్మిస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో షూటింగ్ నిలిపివేసిన '#D43' చిత్ర యూనిట్.. ఇటీవలే హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ షూట్ ని ప్రారంభించారు. ధనుష్ - మాళవిక మోహనన్ తో పాటుగా ఇతర ప్రధాన తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఇందులో ధనుష్ కు దర్శకుడు కార్తీక్ నరేన్ సీన్ గురించి వివరిస్తుండగా.. పక్కన నిర్మాత వీరిని గమనిస్తూ కనిపిస్తున్నాడు.
ఇకపోతే '#D43' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయనున్నారు. ఎమోషన్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రంలో ధనుష్ - మాళవిక ఇద్దరూ జర్నలిస్టులుగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో సముద్రఖని - మహేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
ఇదిలా ఉండగా ధనుష్ ఇప్పటికే 'అత్రాంగి రే' అనే హిందీ చిత్రంతో పాటుగా 'ది గ్రే మ్యాన్' అనే హాలీవుడ్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేశారు. #D43 చిత్రీకరణ పూర్తయితే ధనుష్ నుంచి మూడు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతాయి. ఈ క్రమంలో సెల్వరాఘవన్ డైరెక్షన్ లో 'యుగానికొక్కడు 2'.. మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలానే ధనుష్ ఈసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించనున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ఏషియన్ వారు నిర్మించనున్నారు.