Begin typing your search above and press return to search.

స్టార్ హీరో.. స్టార్ ప్లేయర్.. వాటే స్నేహం!!

By:  Tupaki Desk   |   28 Nov 2016 7:30 PM GMT
స్టార్ హీరో.. స్టార్ ప్లేయర్.. వాటే స్నేహం!!
X
ఏ సినిమా ఫీల్డ్ అయినా హీరో హీరోయిన్ల మధ్య అఫైర్లపై న్యూస్ వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని వాస్తవాలు అయితే.. కొన్ని రూమర్స్ గా మిగిలిపోతుంటాయి. టాలీవుడ్ లో ఇలాంటివి బాగానే ఉంటాయ్. కానీ ఇవేవీ లాంగ్ టెర్మ్ రిలేషన్స్ గా ఉండవు. ఓ ఇద్దరి మధ్య సుదీర్ఘమైన అనుబంధం కొనసాగుతుండడం.. చాలామందికి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా కలిగిస్తోంది.

వారసుడిగా వచ్చినా.. తనదైన స్టైల్ తో పేరు తెచ్చుకున్నాడా స్టార్ హీరో. ఆమె హైద్రాబాద్ బేస్డ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ. ఇద్దరి మధ్యా రిలేషన్ పై గతంలో కూడా వార్తలు వచ్చాయి. వీటిపై ఎప్పుడూ ఎవరూ స్పందించలేదు కూడా. కనీసం అతని భార్య కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకపోవడానికి కారణం.. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీకి ఉన్న పెద్ద.. మంచి పేరు మాత్రమే. అయితే.. ఏళ్లు గడిచినా వీళ్లి స్నేహం కంటిన్యూ అవుతూనే ఉందట. ఎంతగా అంటే.. ఇప్పుడా స్టార్ తన వైఫ్ తో పాటు ఈ ఆటలరాణిని కూడా తీసుకుని బడాబడా పార్టీలకు అటెండ్ అయిపోతుండడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం. అప్పట్లో ఫ్రెండ్స్ మాత్రమే అయిన వీరిద్దరూ.. ఇప్పుడు 'ఫ్యామిలీ' ఫ్రెండ్స్ గా కూడా కంటిన్యూ అయిపోతుండడం ఆశ్చర్యకరమే.

నిజానికి సినిమా ఇండస్ర్టీలో ఇలాంటి బాండింగ్ చాలా రేర్ గా చూస్తుంటాం. అదీనూ మన సౌత్ లో ఇలాంటి బాండ్స్ అన్నీ ఎప్పుడూ ఎఫైర్లకూ పెళ్ళిళ్లకూ దారి తీసినవే. ఇప్పుడు అలాంటివి లేకుండా కొన్ని సంవత్సరాల పాటు జస్ట్ స్నేహం అంటే మాత్రం అది ఖచ్చితంగా విశేషమే!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/