Begin typing your search above and press return to search.

ఓటీటీలను నమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్స్..!

By:  Tupaki Desk   |   6 Nov 2020 11:10 AM GMT
ఓటీటీలను నమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న స్టార్ డైరెక్టర్స్..!
X
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఫిలిం మేకర్స్ ఆలోచనా విధానం కూడా మారిపోయింది. సినిమాలతోనే కాకుండా వెబ్ కంటెంట్ తో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా తమిళ్ స్టార్ డైరెక్ట‌ర్స్ ఓటీటీలను నమ్ముకొని కరోనా డేస్ లో కూడా బాగానే సంపాదించారని తెలుస్తోంది. ఓటీటీల పుణ్యమా అని కొందరు అగ్ర దర్శకులు నిర్మాత‌లుగా కూడా మారుతున్నారు. కొంద‌రు పార్ట‌న‌ర్స్ తో క‌లిసి మీడియం బడ్జెట్ లో ఆంథాలజీ సిరీసులు - వెబ్ మూవీస్ తీస్తున్నారు. స్క్రిప్ట్ ని మాత్రమే అందిస్తూ వారి అసిస్టెంట్ డైరెక్ట‌ర్స్ తో వీటిని రూపొందిస్తున్నారు. చివ‌ర‌కు ఆ సినిమాల్ని సిరీసులను తమకున్న ఫేమ్ ని వాడుకొని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ కి భారీ లాభాల‌కు అమ్ముకొని సొమ్మ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

కోలీవుడ్ డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజు నిర్మాతగా మారి కీర్తి సురేష్ తో 'పెంగ్విన్' అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పార్టనర్స్ తో కలిసి సుమారు 4 కోట్లు ఖర్చు చేశారట. అయితే 'పెంగ్విన్' సినిమాని అన్ని భాష‌లు క‌లిపి దాదాపుగా 11 కోట్ల‌కి అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఇచ్చారని ఓటీటీ వర్గాల సమాచారం. అలానే అమెజాన్ వారి కోసం ఈ మధ్య అగ్ర దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో నలుగురు స్టార్ డైరెక్టర్స్ కలిసి 'పుతం పుదు కలై' అనే ఆంథాలజీని రూపొందించారు. ఈ క్రమంలో మణిరత్నం ప్రొడక్షన్ లో తొమ్మిది మంది దర్శకులు కలిసి 'నవరస' అనే మరో ఆంథాలజీ సిరీస్ తో రాబోతున్నారు. ఇప్పుడు డైరెక్ట‌ర్ అట్లీ కూడా ఇదే దారిలో వ‌చ్చాడు. ప్రొడ్యూసర్ గా మారి 'అంధకారం' అనే సినిమాను రూపొందించాడు. ఈ చిత్రాన్ని కోటి రూపాయ‌ల‌ వరకు బడ్జెట్ పెట్టిన అట్లీ.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వారికి దాదాపు 5 కోట్ల‌కి ఇచ్చినట్లు సమాచారం. ఓటీటీలో వీటికి ఆదరణ లభించినా లభించకపోయినా ఈ డైరెక్ట‌ర్స్ మాత్రం లాభపడుతున్నారు. మ‌రి మన టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఈ పద్ధ‌తిని ఫాలో అవుతారేమో చూడాలి.