Begin typing your search above and press return to search.

ఇదేం బాధరా నాయనా అంటున్న డైరెక్టర్!

By:  Tupaki Desk   |   26 May 2020 11:20 AM IST
ఇదేం బాధరా నాయనా అంటున్న డైరెక్టర్!
X
ఆయన ఓ స్టార్ డైరెక్టర్.. క్రేజీ డైరెక్టర్. ఆయన సినిమా చేస్తానంటే చాలు.. ఎలాంటి స్టార్ హీరో అయినా డేట్స్ ఇస్తారు. అయితే ఆయన మాత్రం ఒక స్టార్ హీరోతో సినిమా చేయాలనే కోరికతో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాకు కమిట్ అయ్యి ఇప్పటికి రెండేళ్ళు అయింది. అదేమో ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాకపోవడంతో తలపట్టుకుంటున్నాడట.

ఎరక్క పోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను అంటూ సాగే అదేదో పాత పాట తరహాలో మన స్టార్ డైరెక్టర్ పరిస్థితి ఉందట. ఈ ప్రాజెక్టు అనవసరంగా ఒప్పుకున్నాను.. దీని బదులు ఎవరైనా వేరే స్టార్ హీరో సినిమా ఒప్పుకుంటే బాగుండేదని మనసులో కుమిలిపోతున్నాడట. ఎందుకంటే ఈ సినిమాకు ఒప్పుకోకపోతే ఈ పాటికి ఈ డైరెక్టర్ కనీసం రెండు సినిమాలు చేసి ఉండేవాడు. ఇదిలా ఉంటే సినిమా షూటింగులు మరో పది రోజుల్లో ప్రారంభం అవుతున్నాయి. దీంతో స్టార్ హీరోగారి టీం ఈ సినిమా పెండింగ్ షూటింగ్ అంతా 60 రోజుల్లో ముగించాలని హుకుం జారీ చేశారట. ఈ ఏడాది చివర్లో ఎలాగైనా రిలీజ్ చెయ్యాలని టార్గెట్ పెట్టారట.

నెలల తరబడి.. ఏళ్ళ తరబడి వెయిట్ చేయించడం.. ఇప్పుడేమో 60 రోజుల్లో మొత్తం కంప్లీట్ చెయ్యాలని చెప్పడంతో ఆ డైరెక్టర్ కు ఏమీ పాలుపోవడం లేదట. అసలే ఈ డైరెక్టర్ కు సినిమాను నెమ్మదిగా తెరకెక్కించడం అలవాటు.. పైగా క్వాలిటీ కోసం రీ షూట్ లు కూడా చేస్తుంటాడు. అలాంటిది డెడ్లైన్స్ పెట్టి సినిమా పూర్తి చెయ్యమంటే ఎలా? ఈ విషయం పైకి చెప్పుకోలేడు.. హీరోగారిని ఏమీ అనలేడు. దీంతో మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉందట. స్టార్ హీరోలతో సినిమా అంటే చాలామంది అదేదో గొప్ప అనుకుంటారు కానీ ఈయనకు మాత్రం మరిచిపోలేని.. మరపురాని అనుభవం మిగిలేలా ఉందని ఫిలిం నగర్ లో చెవులు కొరుక్కుంటున్నారు.