Begin typing your search above and press return to search.
బాలయ్యకోసం స్టార్ డైరెక్టర్ 'నెవర్ బిఫోర్' స్క్రిప్ట్..?
By: Tupaki Desk | 29 Jun 2021 11:00 AM ISTతెలుగు చిత్రపరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ మూవీ పటాస్ నుండి గతేడాది సరిలేరు నీకెవ్వరూ వరకు వరుసహిట్లతో దర్శకుడుగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా నందమూరి ఫ్యాన్స్ నటసింహం బాలయ్యతో సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ కాంబినేషన్ పై సోషల్ మీడియాలో కూడా వార్తలు హల్చల్ చేసాయి. నెట్టింట హల్చల్ బట్టి ఈ కాంబినేషన్ నిజంగానే ఫిక్స్ అయిపోయింది కావచ్చు అనుకున్నారు. అలాగే బాలయ్య పుట్టినరోజున అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని ఎక్సపెక్ట్ చేశారు.
కానీ బాలయ్య బర్త్ డే వచ్చింది. కానీ ఇంతవరకు అనిల్ రావిపూడితో సినిమా గురించి ఎలాంట అప్డేట్ రాలేదు. ప్రస్తుతం ఈ కాంబో గురించి టాలీవుడ్ లో టాక్ మళ్లీ మొదలైంది. అనిల్ నెక్స్ట్ మూవీ బాలయ్యతో తీయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్యతో సినిమా తీసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనిల్. కానీ ఇంతవరకు బాలయ్య నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని టాక్. అయితే ఇటీవలే అనిల్ కథకు బాలయ్య ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో టాక్ స్ప్రెడ్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే అనిల్ కూడా బాలయ్య కోసం అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసాడని అంటున్నారు.
అలాగే బాలయ్యతో సినిమా అంటే డ్రీమ్ లా భావిస్తాడు కాబట్టి క్యారెక్టర్ మాత్రం స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు బాలయ్యను ఎవరు చూపించని విధంగా అనిల్ చూపించనున్నట్లు టాక్. ప్రస్తుతం అనిల్ ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. అయితే ఆ విషయం పై క్లారిటీ రావాలంటే మాత్రం బాలయ్య ప్రస్తుతం చేస్తున్నటువంటి అఖండ సినిమా ఫినిష్ అవ్వాలి. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ మూవీ వీరి కాంబినేషన్ లో మూడో సినిమా. మరి హ్యాట్రిక్ విజయం అందుకుంటుందేమో చూడాలి. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ హిట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన 107వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా జులై చివరిలో పట్టాలెక్కుతుందని సమాచారం.