Begin typing your search above and press return to search.
కూతురి పెళ్లి పనుల్లో స్టార్ డైరెక్టర్..!
By: Tupaki Desk | 22 Jun 2021 11:00 PM ISTదక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కు అదితి - ఐశ్వర్య అనే ఇద్దరు కూతుర్లు.. అర్జిత్ అనే కుమారుడు ఉన్నారనే సంగతి తెలిసిందే. తన పెద్ద కుమార్తె అదితి శంకర్ కు పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్న శంకర్.. చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్తతో పెళ్లి ఖాయం చేశారు. గతేడాది నవంబర్ లో వారికి నిశితార్థం కూడా జరిపించారు. ఇప్పుడు కరోనా పరిస్థితులు చక్కబడటంతో శంకర్ తన కూతురి వివాహం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
తమిళనాడులోని పొల్లాచిలో శంకర్ పెద్ద కుమార్తె వివాహం జరగనుందని తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే శంకర్ అక్కడికి చేరుకొని పెళ్లి పనులు చూసుకుంటున్నారట. వచ్చే వారం మొత్తం ఫ్యామిలీతో కలిసి పొల్లాచిలో ఉంటారని సమాచారం. తన సినిమాలలో గ్రాండియర్ కోసం భారీ సెట్టింగ్స్ వేసి అదరగొట్టే శంకర్.. తన కూతురు వివాహం ఎంత గ్రాండ్ గా చెయ్యబోతున్నారో అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇక శంకర్ సినిమాల విషయానికొస్తే.. కమల్ హాసన్ తో తలపెట్టిన ''ఇండియన్ 2'' సినిమా పలు రకాల కారణాలతో ఆగిపోయింది. ఈ నేపథ్యంలో శంకర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. అలానే రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో 'ఇండియన్ 2' నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు శంకర్ పై కోర్టులో కేసు వేశారు. తమ సినిమా పూర్తయ్యే వరకు శంకర్ మరో ప్రాజెక్ట్ చేయకుండా చూడాలని కోర్టుకు తెలిపింది. దీనిపై ప్రస్తుతం ఇరుపక్షాల వాదనలు జరుగుతున్నాయి.