Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సినిమా..బుక్ అయిన డైరెక్టర్?

By:  Tupaki Desk   |   4 March 2020 1:30 AM GMT
స్టార్ హీరో సినిమా..బుక్ అయిన డైరెక్టర్?
X
ఆయన ఓ పెద్ద స్టార్ హీరో. ఆయన సినిమా కోసం ఎవరైనా డైరెక్టర్ రెడీ అయితే ఎప్పుడైనా ప్రాజెక్ట్ కాన్సిల్ అనే మాట వినేందుకు రెడీగా ఉండాలి. ఓ ఏడాదిగా తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఒక డైరెక్టర్ కు షాక్ ఇస్తూ ప్రాజెక్ట్ లేదని ఫీలర్స్ ఇచ్చాడు. దీంతో ఆ డైరెక్టర్ కు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఇంతలోపు.. మరో దర్శకుడు లైన్ లోకి వచ్చాడు .

ఈ రెండో దర్శకుడు ఒక బ్లాక్ బస్టర్ సాధించి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో పట్టుబట్టుకుని కూర్చున్నాడు. ఈ స్టార్ హీరోకు కూడా చాలా రోజుల క్రితమే కథ చెప్పాడు. ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక చేసేదిలేక ఒక మీడియం రేంజ్ హీరోతో సరిపెట్టుకున్నాడు. ఆ హీరోతో ప్రాజెక్ట్ ఓకే అయింది. సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సమయంలో ఆ స్టార్ హీరో నుంచి మరోసారి పిలుపు వచ్చింది. ఈ స్టార్ హీరోతో సినిమా చేయాలంటే చేతిలో ఉన్న ప్రాజెక్ట్ వదులుకోవాలి. పోనీ.. రిస్క్ తీసుకుని ఆ మీడియం రేంజ్ హీరో ప్రాజెక్ట్ పక్కన పెడదామంటే ఈ స్టార్ హీరో మరోసారి హ్యాండ్ ఇస్తే ఏం చెయ్యాలా అన్ని డైలమాలో ఉన్నాడట.

ఇదిలా ఉంటే ఆల్రెడీ స్టార్ హీరో సినిమా క్యాన్సిల్ కావడంతో షాక్ తిన్న డైరెక్టర్ నెమ్మదిగా తేరుకుని స్టార్ హీరో సతీమణి గారి దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా లైన్ లోనే ఉందని.. క్యాన్సిల్ అయినట్టు లెక్క కాదని అంటున్నారు. దీంతో సదరు స్టార్ హీరోగారి దెబ్బకు కన్ఫ్యూజన్ గేమ్ కొనసాగుతూనే ఉందట. అసలు ఎందుకు ఇంత తికమక? ఈయన తికమక పడిపోయి ఆ తికమకలో తన కోసం వచ్చే డైరెక్టర్లను మకతికకు గురిచేసి మతిచెడగొడుతూ బెదరగొడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.