Begin typing your search above and press return to search.

ఒక్కరోజు యాడ్ కోసం స్టార్ డైరెక్టర్.. షాకింగ్ రెమ్యూనరేషన్!

By:  Tupaki Desk   |   29 March 2021 4:30 PM GMT
ఒక్కరోజు యాడ్ కోసం స్టార్ డైరెక్టర్.. షాకింగ్ రెమ్యూనరేషన్!
X
సినీ సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్ ఫిలిమ్స్ చేస్తారనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోల దగ్గరనుండి హీరోయిన్స్, డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ యాడ్స్ చేసేవాళ్ళే. అయితే వీరందరిలో స్టార్ హీరోలకు ఎక్కువగా రెమ్యూనరేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునేది దర్శకుడేనట. అంటే అన్ని సందర్భాలలో ఇలా జరుగుతుందో లేదో తెలియదు గాని టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మాత్రం ఒకరోజు యాడ్ డైరెక్ట్ చేస్తే లక్షల్లో వెనకేసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ చేస్తాడనేది అందరికి విదితమే. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా యాడ్స్ చేస్తుంటారు. ఇటీవలే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా కూడా మహేష్ తో కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చేసాడు.

అయితే ఒకరోజులో జరిగే ఈ యాడ్ ఫిల్మ్ షూట్ కోసం డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటారు అనేదానిపై చర్చ నడుస్తుంది. మహేష్ తో సందీప్ వంగా చేసిన యాడ్ కోసం 5లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యాడ్స్ విషయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ మాత్రం సందీప్ కు ఆరు రెట్లు ఎక్కువగా తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే ఒక్కో యాడ్ ఫిలిమ్ కోసం త్రివిక్రమ్ దాదాపు 30లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరో విషయం ఏంటంటే.. యాడ్ ఫిల్మ్ కాన్సెప్ట్, స్క్రిప్ట్ కూడా కంపెనీ వారే అందిస్తారు. వాటి విషయంలో డైరెక్టర్ క్రియేటివిటీ చూపించాల్సిన అవసరం లేదు. మరి ఈ లెక్కన త్రివిక్రమ్ 30లక్షలు ఒక్కరోజుకు తీసుకుంటే బెటర్ గానే వెనకేసుకుంటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.