Begin typing your search above and press return to search.

25 కోట్ల‌తో క‌ళ్లు చెదిరే డూప్లెక్స్ కొనుక్కున్న‌ స్టార్ డైర‌క్ట‌ర్

By:  Tupaki Desk   |   20 April 2021 6:00 AM IST
25 కోట్ల‌తో క‌ళ్లు చెదిరే డూప్లెక్స్ కొనుక్కున్న‌ స్టార్ డైర‌క్ట‌ర్
X
కొంద‌రు స్టార్ డైరెక్ట‌ర్ల పారితోషికాలు స్టార్ హీరోల్ని మించిపోతాయి. ఆ కోవ‌కే చెందుతాడు ట్యాలెంటెడ్ ఆనంద్ ఎల్.రాయ్. అత‌డు తెర‌కెక్కించే సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ బడ్జెట్ల‌తో తెర‌కెక్కి అంతే గొప్ప‌ వ‌సూళ్ల‌ను సాధిస్తుంటాయి.

బాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించిన డ‌జ‌ను చిత్రాల్ని తెర‌కెక్కించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం. త‌ను వెడ్స్ మ‌ను- త‌ను వెడ్స్ మ‌ను రిట‌ర్న్స్ - రాంజానా- శుభ్ మంగ‌ల్ జ్యాదా సావ‌ధాన్- తుంబాద్- లాల్ క‌ప్టాన్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు తెర‌కెక్కించారు. షారూక్ తో జీరో చిత్రాన్ని తెర‌కెక్కించినా అది బాక్సాఫీస్ వ‌ద్ద‌ విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం షారూక్ ఖాన్ క‌థానాయ‌కుడిగా ధనుష్‌- అక్ష‌య్ క‌థానాయ‌కుడిగా అట్రాంగిరే.. జాన్వీ ప్ర‌ధాన పాత్ర‌లో గుడ్ ల‌క్ జెర్రీ.. ర‌క్షా బంధ‌న్ అనే చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు ఆనంద్ ఎల్ రాయ్ రూ. ముంబైలో 25.3 కోట్లతో క‌ళ్లు చెదిరే డూప్లెక్స్ ని సొంతం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ ఇల్లు సన్నీ లియోన్ డూప్లెక్స్ కి స‌మీపంలో ఉంది.

ఆనంద్ ఎల్ రాయ్ తన భార్య యోగితతో కలిసి రూ. 25.3 కోట్ల పెట్టుబ‌డిని బంగ్లాపై పెడుతున్నారు. 5761 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇల్లు ఐదు కార్ పార్కింగ్ స్లాట్ లను క‌లిగి ఉంది. ఈ ఇంటి కోసం మార్చి 8 న రూ. 75.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చార‌ట‌.

తాజా నివేదిక ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది. ఇందులో మొత్తం 34 అపార్టుమెంట్లు ఉన్నాయి. తక్కువ స్టాంప్ డ్యూటీ ప్రయోజనాన్ని పొందడానికి ఫ్లాట్ ఇప్పుడు రికార్డుల్లో నమోదు చేసార‌ట‌.