Begin typing your search above and press return to search.

ది 'బీస్ట్' టీమ్‌ లో నటుడిగా స్టార్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   8 Aug 2021 8:42 AM GMT
ది బీస్ట్ టీమ్‌ లో నటుడిగా స్టార్‌ డైరెక్టర్‌
X
తమిళంతో పాటు తెలుగులో కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సెల్వ రాఘవన్‌ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే సాయి కాయిదమ్‌ అనే సినిమాలో నటించి మెప్పించిన ఈయన తాజాగా మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అదే తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న బెస్ట్‌ సినిమా. నెల్సన్ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమాలో సెల్వ రాఘవన్ నటిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన నటీ నటులకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో సెల్వ రాఘవన్‌ పేరు ఉంది.

బెస్ట్‌ టీమ్‌ ది బెస్ట్‌ ను ఎంపిక చేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా దర్శకుడు నెల్సన్‌ కుమార్‌ తెరకెక్కించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రకు గాను ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్‌ ను ఎంపిక చేయడంతో సినిమా స్థాయి మరింతగా పెరిగిందంటూ తమిళ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న బెస్ట్‌ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇటీవల రివీల్‌ చేసి సినిమా పై అంచనాలను భారీగా పెంచారు.

విజయ్‌ మరియు నెల్సన్ ల కాంబో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. విజయ్ అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు అంతా కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా ఈ సినిమాను పలు భాషల్లోవిడుదల చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే ముగించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది.