Begin typing your search above and press return to search.

స్టార్ డాటర్.. ట్రెడిషన్ లుక్..!

By:  Tupaki Desk   |   28 Oct 2022 4:22 AM GMT
స్టార్ డాటర్.. ట్రెడిషన్ లుక్..!
X
స్టార్ కిడ్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంటుంది. వారు వేసుకునే డ్రెస్ ల దగ్గర నుంచి అందరు క్లీన్ అబ్సర్వేషన్ చేస్తారు. ఇక కొందరు బాలీవుడ్ స్టార్ కిడ్స్ వారికి ఇష్టం వచ్చినట్టు ఉంటారు. లైక్ షారుఖ్ ఖాన్ తనయురాలు సుహానా ఖాన్ ఎన్నోసార్లు తన హాట్ ఫోటోలతో మీడియాలో హాట్ న్యూస్ అయ్యింది.

ఇలానే ఉండాలన్న రూల్ ఏమి లేకపోయినా వారు చేస్తున్న పనుల మీద మీడియా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్, అనన్యా పాండే ల మీద మీడియా ఆసక్తి చూపిస్తుంది. జాన్వి కపూర్ ఎప్పుడు కొత్త ఫోటో షూట్ చేస్తే అప్పుడు దాన్ని వైరల్ చేస్తుంటారు.

జాన్వి యంగర్ సిస్టర్ ఖుషి మీద కూడా మీడియా ఫోకస్ చేస్తుంది. ఈ స్టార్ కిడ్స్ లో ఇన్నాళ్లు అసలు బయటకు రాని ఒకరు దివాళి బర్త్ డే పార్టీలో ఎక్స్ పోజ్ అయ్యారు. ఆమె ఎవరో కాదు అజయ్ దేవగన్, కాజోల్ ల గారాలపట్టి నిసా దేవగన్.

అందరి బాలీవుడ్ స్టార్ కిడ్స్ లానే తనకి కావాల్సినంత ఫ్రీడం ఇచ్చినట్టు అర్ధమవుతుంది. అయితే స్వేచ్చ ఇచ్చారు కదా అని మిగతా వారిలా రెచ్చిపోకుండా తన లిమిట్స్ లో తాను ఉంటుంది నిసా దేవగన్. ఇక లేటెస్ట్ గా దివాళి పార్టీలో ట్రెడిషనల్ లుక్ లో నిసా ఎట్రాక్ట్ చేసింది. నిసా ప్రస్తుతం సింగపూర్ లోని యునైటెడ్ వరల్డ్ కాలేజ్ లో చదువుతుంది.

సరైన అవకాశం వస్తే కూతురిని ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు అజయ్ దేవగన్, కాజోల్. బాలీవుడ్ తెర మీద చెరగని ముద్ర వేసిన తార కాజోల్ ఆ నట వారసత్వాన్ని నిసా కొనసాగిస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటికే నిసా తొలి సినిమా కోసం స్టార్ పేరెంట్స్ కథలు డిస్కస్ చేస్తున్నారట.

మంచి కథ వస్తే తమ కూతురిని తొలి పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈలోగా నిసా బాలీవుడ్ పార్టీల్లో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తుంది. దీవాళి పార్టీలో అందరి కన్నా నిసా మీదే ఎక్కువ ఫోకస్ ఉండేలా తన డ్రెసింగ్ స్టైల్ ఉంది. తప్పకుండా ఆమె కూడా వారి స్టార్ పేరెంట్స్ లాగా వెండితెర మీద అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నారు బాలీవుడ్ ఆడియన్స్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.