Begin typing your search above and press return to search.
అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడిన స్టార్ డాటర్
By: Tupaki Desk | 1 July 2021 11:45 AM GMTకేథార్ నాథ్ చిత్రంతో కథానాయికగా ఆరంగేట్రం చేసిన సారా అలీఖాన్ ఆ సినిమాలో నటించే సమయంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు ఈ జంట డేటింగ్ కొనసాగింది. బ్యాంకాక్ లో రొమాంటిక్ హాలీడేస్ ని ఆస్వాధించారు. సుశాంత్ సింగ్ మరణానంతరం ఈ విషయంపైనా బోలెడంత డిబేట్ నడిచింది.
ఆ ప్రేమకథ ముగిసింది అనగానే గత సంవత్సరం `లవ్ ఆజ్ కల్ 2` కోస్టార్ కార్తీక్ ఆర్యన్ తో లవ్ లో పడిందంటూ ప్రచారం సాగింది. ఆ మూవీ విడుదలకు ముందే ఈ జంటకు బోలెడంత పాపులారిటీ దక్కింది. వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ రియల్ కపుల్ నే తలపించింది. డేటింగ్ చేస్తున్నారని కూడా పుకారు వచ్చింది. అయితే ఇంతలోనే ఈ జంట విడిపోయినట్లు వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మరో కొత్త ప్రేమకథ తెరపైకొచ్చింది. సారా `కేదార్ నాథ్` అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండాతో ఉన్న ఫోటోలు లీకయ్యాయి. ఆ ఇద్దరి మధ్యా రొమాంటిక్ సంభాషణలు రకరకాల సందేహాలకు తావిచ్చాయి. జెహాన్ మొదట తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇద్దరి మనోహరమైన బీచ్ చిత్రాన్ని పంచుకున్నాడు. సారా తన ఇన్ స్టాగ్రామ్ లో లవ్ యు..టేక్ మి బ్యాక్ అని GIF లతో తిరిగి పోస్ట్ చేసింది. సారా - జెహన్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడడంతో ఆ ఇద్దరి మధ్యా ప్రేమాయణం సాగుతోందంటూ ప్రచారం మొదలైంది.
గత సంవత్సరం సారా పుట్టినరోజు సందర్భంగా జెహాన్ కొన్ని ఫోటోలు ఒక వీడియోను పంచుకున్నాడు. వాటిలో కొన్ని చిరస్మరణీయ క్షణాలను ఎలివేట్ చేయడం కనిపించింది. అతను వీడియోకు ఇచ్చిన క్యాప్షన్ అగ్గి రాజేసింది. మన ప్రేమకు స్నేహానికి .. సంవత్సరాలుగా మనం సృష్టించిన జ్ఞాపకాలకు మించి ఇంకేదీ లేదు.. ప్రేమ వేడుకలు.. మంచి సమయాలు.. చెడు సమయాలు.. అపూర్వమైన నష్టం.. మహమ్మారి! అంటూ వ్యాఖ్యను జోడించారు.
మేము పిల్లలం.. అనేక దశల భావోద్వేగాలతో ముందుకు వెళుతూ.. ఒకరికొకరు ఇరుక్కున్నారని ఎవరికి తెలుసు. నేను ఎల్లప్పుడూ మీ వెన్నుముకగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ప్రపంచాన్ని జయించండి..!! అని జహాన్ తన సుదీర్ఘ నోట్ ని రాసాడు. ఇంతకీ సారా- జెహాన్ లవ్ లో ఉన్నారా? అన్నదానికి ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది.
సారా గతంలో తనపై వచ్చిన పుకార్ల గురించి ఎప్పుడూ స్పందించలేదు. ప్రస్తుతం ఓ ప్రేమకథలో మరోసారి కలిసి నటించడానికి సారా- కార్తీక్ లను సంప్రదించినట్లు కథనాలొస్తున్నాయి. అయితే ఇంకా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించలేదు. సారా తదుపరి `అట్రాంగిరే` చిత్రంలో నటిస్తోంది. అక్షయ్ - ధనుష్ ఇందులో హీరోలు. విక్కీ కౌషల్- ఆదిత్యధర్ లతో కలిసి `ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ` లోనూ సారా ఒక నాయిక గా నటిస్తోంది.