Begin typing your search above and press return to search.

బిగ్ షాట్ తో స్టార్ డాట‌ర్ ఎఫైర్.. అత‌నెవ‌రో తెలిస్తే షాక్!

By:  Tupaki Desk   |   11 May 2021 3:30 PM GMT
బిగ్ షాట్ తో స్టార్ డాట‌ర్ ఎఫైర్.. అత‌నెవ‌రో తెలిస్తే షాక్!
X
సినీరంగ ప్ర‌ముఖుల‌తో రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు .. క్రీడాకారులు ప్రేమాయ‌ణాలు సాగించ‌డం రెగ్యుల‌ర్ గా చూసేదే. అల్ల‌రి హాసినిగా పాపుల‌రైన జెనీలియా.. మాజీ క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి త‌న‌యుడు హీరో రితేష్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. రితేష్ స‌ర‌స‌న న‌టించిన జెనీలియా అత‌డితో ప్రేమాయ‌ణం సాగించి పెళ్లాడింది.

కానీ ఈసారి ఓ రాజ‌కీయ నాయ‌కుడి వార‌సుడితో షికార్లు చేస్తూ బాలీవుడ్ యువ‌నాయిక మీడియా క‌థ‌నాల్లో హైలైట్ అవుతోంది. బాలీవుడ్ న‌టి పూజాబేడి-ప‌ర్హాన్ ఫ‌ర్నిచ‌ర్ వాలా వార‌సురాలిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన అల‌యా బేడి గ‌తేడాదే `జ‌వానీ జనీమాన్` సినిమాతో బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆల‌యా ఇప్పుడు శివ‌సేన అధినేత‌.. దివంగ‌త బాల్ ఠాక్రే మ‌న‌వడు ఐశ్వ‌రీ ఠాక్రే తో చ‌నువుగా ఉంటోంద‌ని.. అత‌ని ప్రేమ‌లో మునిగింద‌ని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇరువురు చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్లు ముంబై మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. ఆల‌యా బేడి త‌న 22వ పుట్టిన రోజు వేడుక‌లు దుబాయ్ లో ఐశ్వ‌రీ ఠాక్రేతో క‌లిసి జ‌రుపుకున్నారు. ఈ వేడుకు ఠాక్రే కుటుంబ స‌భ్యులు సైతం హాజ‌రైనట్లు తెలుస్తోంది. ఆ పార్టీలోనే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆలయా లంచ్ చేసింద‌ట‌.

అయితే ఎఫైర్ ప్ర‌చారంపై ఆల‌యా మీడియా క‌థ‌నాల్ని కొట్టి పారేసింది. ఐశ్వ‌రీ కేవ‌లం మంచి స్నేహితుడు మాత్ర‌మేన‌ని త‌ప్పుగా అర్ధం చేసుకోవ‌ద్ద‌ని పేర్కొంది. అలాగే అల‌యా త‌ల్లి కూడా ఈ ప్ర‌చారాన్ని ఖండించారు. ఊహాగానాల‌తో వ్య‌క్తిగ‌త జీవితాల‌పై దాడి భావ్యం కాద‌ని అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసారు. ఇక పూజా బేడి భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న నేప‌థ్యంలో కుమార్తె ఆల‌యా త‌ల్లికి రెండ‌వ పెళ్లి కూడా చేయ‌డానికి ముహూర్తం పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా వివాహం వాయిదా ప‌డింది.