Begin typing your search above and press return to search.

స్టార్ క్రికెటర్ కేజీఎఫ్ డైలాగ్ ట్వీట్.. నెట్టింట వైరల్!

By:  Tupaki Desk   |   19 Feb 2021 11:00 AM GMT
స్టార్ క్రికెటర్ కేజీఎఫ్ డైలాగ్ ట్వీట్.. నెట్టింట వైరల్!
X
మోస్ట్ అవెయిటింగ్ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్-2. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ కలిగి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేజీఎఫ్-2 టీజర్ విడుదల అయినప్పుడే ఈ సినిమా స్టామినా ఏంటో అందరికి అర్థమైపోయింది. సినిమా ఇండస్ట్రీకి చెందినవారితో పాటు కేజీఎఫ్ బయటివాళ్ళను కూడా చాలా ప్రభావితం చేసింది. అదెలా అంటే తాజాగా ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ అందుకు నిదర్శనం. కేజీఎఫ్-2 టీజర్ లో వినిపించే మోస్ట్ పవర్ ఫుల్ డైలాగ్ తో శివాజీ మహారాజ్ ను సంబోధించాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సెహ్వాగ్ ట్వీట్ తెగవైరల్ అవుతోంది.

కేజీఎఫ్ టీజర్ నుండి 'హిస్టరీ టెల్ అస్.. పవర్ ఫుల్ పీపుల్ కంస్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్. బట్ హిస్టరీ వాస్ రాంగ్.. పవర్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్' అనే పవర్ ఫుల్ డైలాగ్ ఛత్రపతికి సూట్ అయ్యేలా పోస్ట్ చేయడం సోషల్ మీడియా యూజర్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సెహ్వాగ్ ను నేటిజన్లు తెగ కొనియాడుతూ పోస్ట్ వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేజీఎఫ్-2 మూవీ ఈ ఏడాది జులై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న కారణంగా ఇలాంటి సమయంలో తమ అభిమాన సినిమా గురించి సెలబ్రిటీలు ప్రస్తావించడంతో వారి ఆనందానికి అడ్డులేకుండా పోయిందట. పాన్ ఇండియా స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.