Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్స్ లేట్ నైట్ హంగామా

By:  Tupaki Desk   |   14 Feb 2022 10:49 AM GMT
స్టార్ క‌పుల్స్ లేట్ నైట్ హంగామా
X
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార యంగ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ తో గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో వుంది. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని, ఇప్ప‌టికే పెళ్లి చేసుకున్నార‌ని, లేదు లేదు త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటారంటూ ఎప్ప‌టి క‌ప్పుడు స‌రికొత్త క‌థ‌నాలు నెట్టింట కొన్ని నెల‌లుగా వైర‌ల్ అవుతూనే వున్నాయి. పెళ్లికి టైమ్ రావాలంటూనే స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ప్ర‌తీ అకేష‌న్ ని జంట‌గా సెల‌బ్రేట్ చేసుకుంటూ నెట్టింట వైర‌ల్ గా నిలుస్తున్నారు.

సోమ‌వారం వాలెంటైన్స్ డే కావ‌డంతో ఈ జంట నెట్టింట అర్థ్ర రాత్రి నుంచే హంగామా మొద‌లుపెట్టేసింది.

గ‌త కొన్నేళ్లుగా ప్రేమ‌లోకంలో విహ‌రిస్తూ హాట్ టాపిక్ గా మారిన న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల జంట వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఓ స్పెష‌ల్ వీడియోని అభిమానుల‌తో పంచుకున్నారు. విఘ్నేష్ శివ‌న్ త‌న ఇన్ స్టా గ్రామ్ వేదిగా ఓ వీడియోని షేర్ చేశారు. ఇప్ప‌డ‌ది నెట్టింట హంగామా చేస్తోంది. వాలెంటైన్స్ డే కోసం 13 అర్థ్రా రాత్రి నుంచే ఈ జంట హంగామా మొద‌లుపెట్టింది.

లేట్ నైట్ ఫ్ల‌వ‌ర్ బొకేతో విఘ్నేష్ శివ‌న్ కు ఎదురుప‌డిన న‌య‌న‌తార సిగ్గుల మొగ్గ‌వుతూ త‌న చేతిలో వున్న బోకేని విఘ్నేష్ కి అందించింది. ఆ వెంట‌నే త‌న‌ని హ‌గ్ చేసుకుని త‌న కౌగిలితో బందీని చేసింది. దీనికి సంబంధించిన వీడియోని విఘ్నేష్ ఇన్ స్టా వేదిగా అభిమానుల‌తో పంచుకున్నాడు. దీనికి అంద‌మైన క్యాప్ష‌న్ ని కూడా జ‌త చేశాడు.

`తొలిసారి త‌న‌కు ఫ్ల‌వ‌ర్ బొకేని అందించి ప్ర‌పోజ్ చేసిన‌ట్టుగా న‌య‌న త‌న‌కు ఫ్ల‌వ‌ర్ బొకేని అందించింద‌ని, ఇదే నిజ‌మైన వాలెంటైన్స్ డే అని విఘ్నేష్ శివ‌న్ కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌నింది. ఈ వీడియోతో పాటు కొన్ని ఫొటోలని కూడా అభిమానుల‌తో పంచుకున్నారు. ఎల్లోక‌ల‌ర్ షార్ట్ గౌన్ లో పైన బ్లాక్ జీన్స్ ష‌ర్ట్ ధ‌రించిన న‌య‌న క‌నిపించ‌గా, బ్లూ జీన్స్‌.. బ్లూ ష‌ర్ట్ లో క‌నిపించాడు.

న‌య‌న‌తార ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన `కాతువాకుల రెండు కాద‌ల్‌` చిత్రంలో న‌టిస్తోంది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో మ‌రో కీల‌క పాత్ర‌లో స‌మంత న‌టిస్తోంది. ఇటీవ‌లే ఈ మూవీ టీజ‌ర్ ని రిలీజ్ చేశారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ ఏప్రిల్ 28న విడుద‌ల కానుంది.