Begin typing your search above and press return to search.
పార్టీలతో చెలరేగుతున్న స్టార్ కపుల్స్
By: Tupaki Desk | 4 Sept 2021 7:00 PM ISTఈ ఏడాది ఆరంభంలో స్టార్ కపుల్స్ మాల్ధీవుల విహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మలైకా- అర్జున్ .. కాజల్ - కిచ్లు.. కియరా- మల్హోత్రా.. జంటలు మాల్దీవుల్లో విహరించి అక్కడి నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నుంచి చాలామంది స్టార్ కపుల్స్ మాల్దీవుల సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేశారు.
అయితే బీచ్ పార్టీల్లోనే కాదు.. వీలున్న అన్ని మార్గాల్లోనూ సెలబ్రేషన్స్ కి స్టార్ కపుల్స్ సిద్ధమవుతుండడం ఇటీవల చూస్తున్నదే. లేట్ నైట్ పార్టీలతో హడావుడి కనిపిస్తోంది. మాలీవుడ్ స్టార్స్ పృథ్వీరాజ్-దుల్కార్ సల్మాన్ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలిద్దరు షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఫ్యామిలీస్ తో గెట్ టు గెదర్ పార్టీల్లో చిలౌట్ చేస్తుంటారు. ఇక పుట్టిన రోజు..పెళ్లి రోజు వేడుకల్ని అయితే అస్సలు మిస్ అవ్వరు. ఎంత బిజీగా ఉన్నా ఒకేచోట కలిసి ఫ్యామిలీ పార్టీలు చేసుకుంటారు.
తాజాగా దుల్కార్ సల్మాన్ సతీమణి అమల్ సూఫియా పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరోలిద్దరి కుటుంబాలు మరోసారి కలిసాయి. ఓ రెస్టారెంట్ లో సెలబ్రిటీ కపుల్స్ పార్టీ ని సెలబ్రేట్ చేసుకున్నారు. పృథ్వీ రాజ్ ..ఆయన సతీమణి సుప్రియా మీనన్.. దుల్కార్ సల్మాన్.. ఆయన భార్య అమల్ సూఫియా అంతా ఒకేచోట అసోసియేట్ అయ్యారు.
నైట్ పార్టీని ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం రెండు కుటుంబాలు సెల్ఫీలు దిగాయి. పృథ్వీరాజ్ నలుగురితో కూడిన ఓ సెల్ఫీని ఇన్ స్టా వేదికగా అభిమానులకు షేర్ చేసారు. ఇలాంటి పార్టీలు మిస్ చేసుకోమంటూ పృథ్వీరాజ్ సతీమణి క్యాప్షన్ ఇచ్చారు. ఇక పృథ్వీరాజ్ ఇటీవల ఓ సంచలన చిత్రం నుంచి తప్పుకున్నారు. 1921 లో మలబారు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వరియమ్ కన్నాథ్ కున్హమ్మద్ హాజీపై పై చిత్రాన్ని తెరకెక్కించడానికి ఏడాది కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్ర నిర్మాతతో తలెత్తిన విబేధాల కారణంగా నటుడు పృథ్వీరాజ్ తో పాటు..చిత్ర దర్శకుడు ఆషిక్ అబూ కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
మలబారు తిరుగుబాబు జరిగి ఈ ఏడాదితో 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాలని కంపాషన్ మూవీస్ పతాకంపై జికందర్- మోయిద్దీన్ సంయుక్తంగా రంగంలోకి దిగారు. కానీ సినిమా స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత రైటర్లలో ఒకరైన రమీజ్ కూడా నిర్మాతతో విబేధాలు కారణంగా తప్పుకున్నారు. ఇప్పుడు ఏకంగా హీరో..దర్శకులే తప్పుకోవడంతో ప్రాజెక్ట్ రద్దయినట్లు తెలుస్తోంది.