Begin typing your search above and press return to search.

డీప్ ఫారెస్ట్ లో స్టార్ క‌పుల్ వైల్డ్ లైఫ్ షాకిస్తోందిగా

By:  Tupaki Desk   |   2 Jan 2021 11:45 AM IST
డీప్ ఫారెస్ట్ లో స్టార్ క‌పుల్ వైల్డ్ లైఫ్ షాకిస్తోందిగా
X
స్టార్ హీరో రణబీర్ కపూర్ -అలియా భట్ జంట‌కు నిశ్చితార్థం జ‌రిగిపోతోంద‌ని ఈ ఏడాది పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని ఒక‌టే ప్ర‌చారం సాగిపోయింది. మొన్న‌టికి మొన్న నేడే నిశ్చితార్థం అన్న ప్ర‌క‌ట‌న‌తో అభిమానులంతా విస్మ‌యానికి గుర‌య్యారు. ఉన్న‌ట్టుండి స‌డెన్ ట్విస్టిస్తున్నారా? నిప్పు లేకుండా పొగ రాదు క‌దా! అన్న గుస‌గుస‌లు వేడెక్కిపోయాయి. క‌ట్ చేస్తే.. ర‌ణ‌బీర్ .. ఆలియా ఇరుకుటుంబీకుల‌తో క‌లిసి రాజ‌స్థాన్ జైపూర్ స‌మీపంలోని ర‌ణ‌తంబోర్ డీప్ ఫారెస్టులో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్ని ప్లాన్ చేశార‌ని తెలిసింది.

అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. నూతన సంవత్సర రోజున రణతంబోర్ లో ఆలియా-ర‌ణ‌బీర్ జంట‌ వన్యప్రాణుల అన్వేష‌ణ‌లో ముగినిపోయారు.

రణబీర్ కపూర్ - అలియా భట్ వారి కుటుంబంతో కలిసి రణతంబోర్లో నూతన సంవత్సర వేడుక‌ల్ని ఘ‌నంగా జ‌రుపుకున్నారు. స‌ద‌రు ల‌వ్ క‌పుల్ అలియా తల్లి సోని రజ్దాన్ సోదరి షాహీన్ భట్‌లతో కలిసి రణతంబోర్ అడవిని అన్వేషించారు. వారి జంగిల్ సఫారి నుండి వచ్చిన ఓ ఫోటోని స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ నలుగురూ ఓపెన్ జీపులో వ‌న్య‌ప్రాణుల ఫోటోగ్ర‌ఫీ కోసం షికార్ వెళ్లారు. రణబీర్ - అలియా జీప్ లో వెనుక వైపు కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. రణబీర్ తల్లి నీతు కపూర్ - సోదరి రిద్దిమా కపూర్ సాహ్ని- బావమరిది భరత్ సాహ్ని- మేనకోడలు సమ్రా ఈ టూర్ లో ఉన్నారు. వీరితో పాటు ద‌ర్శ‌క నిర్మాత అయాన్ ముఖర్జీ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొనే కూడా కొత్త సంవత్సరంలో వారితో కలిసి ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌టన నుంచి ఫోటోల్ని రిద్దిమా కపూర్ సాహ్ని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.