Begin typing your search above and press return to search.

హాలిడే ముగించుకుని వచ్చిన స్టార్ కపుల్..!

By:  Tupaki Desk   |   1 Dec 2020 9:35 AM IST
హాలిడే ముగించుకుని వచ్చిన స్టార్ కపుల్..!
X
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య - సమంత లు ప్రముఖ పర్యాటక కేంద్రం మాల్దీవులకు వెళ్ళిన సంగతి తెలిసిందే. సామ్ అక్కడే తన హస్బెండ్ నాగచైతన్య బర్త్ డే(నవంబర్ 23) సెలబ్రేట్ చేసింది. కోవిడ్ నేపథ్యంలో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఈ జంట.. మాల్దీవులకు వెళ్లి అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. వారానికి పైగా హాలిడే ని గడిపిన చై-సామ్ జంట ఈరోజు తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. చైతన్య - సమంత మాస్కులు ధరించి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

కాగా, సమంత అక్కినేని ఈ మధ్య మాల్దీవుల బీచ్ లో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. ఆహ్లాదకరమైన ప్రకృతిలో హాట్ హాట్ ఫోజులకి తోడు స్కూబా డైవింగ్ లాంటివి కూడా చేసి నెటిజన్స్ ని అట్రాక్ట్ చేసింది. అలానే సముద్రపు సోయగాలకు తన బికినీ అందాలను కలిపి సామ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు విహారయాత్ర ను ముగించిన ఈ సెలబ్రెటీ కపుల్ తిరిగి వచ్చేసారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాగచైతన్య ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టొరీ' సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. త్వరలోనే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. అలానే ఆహా యాప్ కోసం 'సామ్ జామ్' అనే టాక్ షో చేస్తోంది.