Begin typing your search above and press return to search.

స్టార్ కమెడియన్ మళ్లీ హీరోగా వస్తున్నాడు..!!

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
స్టార్ కమెడియన్ మళ్లీ హీరోగా వస్తున్నాడు..!!
X
టాలీవుడ్ లో హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి.. 'సప్తగిరి ఎక్స్‌ ప్రెస్' సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'సప్తగిరి ఎల్ఎల్‌బి' 'వజ్రకవచధర గోవింద' 'గూడుపుఠాణి' వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.

హీరోగా మాత్రమే చేస్తానని పట్టుబట్టకుండా ఓవైపు కామెడీ రోల్స్ చేస్తూనే.. మరోవైపు మంచి కథలు వచ్చినప్పుడల్లా లీడ్ క్యారక్టర్స్ లో నటిస్తున్నాడు. ఇప్పుడు "అన్ స్టాపబుల్" అనే సినిమాతో మళ్లీ హీరోగా అలరించడానికి వస్తున్నాడు సప్తగిరి.

'అన్ స్టాపబుల్' సినిమాకి 'నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్' అనేది ట్యాగ్ లైన్. ఇందులో సప్తగిరితో పాటుగా 'బిగ్‌ బాస్' తెలుగు సీజన్-5 విజేత వీజే సన్నీ మరో హీరోగా నటిస్తున్నారు. 'సన్నాఫ్ ఇండియా' ఫేమ్ డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సప్తగిరి మంచి టాలెంట్ ఉన్న నటుడనే సంగతి తెలిసిందే. అతని టైమింగ్ ని ప్రేక్షకులు బాగా ఇష్టపడుతుంటారు. అతని సినిమాలను ఆదరించే జనాలు ఉన్నారు. మంచి స్క్రిప్ట్ దొరికి సరైన దర్శకుడి చేతిలో పడితే సప్తగిరి కచ్చితంగా హిట్టు కొడతాడని సినీ అభిమానులు భావిస్తుంటారు.

'అన్ స్టాపబుల్' సినిమా హీరోగా సప్తగిరి కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఏ2బి ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో రంజిత్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి - పృధ్వీ - మణి చందన - షకలక శంకర్ - చమ్మక్ చంద్ర - బిత్తిరి సత్తి - గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.