Begin typing your search above and press return to search.

మళ్ళీ బుల్లి తెరపై హాస్య బ్రహ్మ

By:  Tupaki Desk   |   2 July 2020 9:45 AM IST
మళ్ళీ బుల్లి తెరపై హాస్య బ్రహ్మ
X
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మానందం తప్పనిసరిగా నటించాల్సిందే. ఆయన కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసేవారు. స్టార్ హీరోల స్థాయిలో క్రేజ్ ను దక్కించుకున్న బ్రహ్మీ గత కొంత కాలంగా సినిమాల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. అసలు ఈయనకు చాన్స్ లు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ ఈయన నటించినా కూడా ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

బ్రహ్మానందం అంటే ప్రేక్షకులకు ఇంకా అభిమానం ఉన్నా కూడా ఆయన కోసం మంచి పాత్రలను మాత్రం దర్శకులు క్రియేట్ చేయలేక పోతున్నారు. ఇలాంటి సమయంలో బ్రహ్మానందం బుల్లి తెరపై సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారట. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. గతంలో బ్రహ్మానందం బుల్లి తెరపై కనిపించాడు. కామెడీ షో కు జడ్జ్ గా వ్యవహరించిన బ్రహ్మానందం ఇప్పుడు సీరియల్ లో నటించనున్నాడట.

ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఒకటి రూపొందించబోతున్న సీరియల్ లో బ్రహ్మానందం ను నటింపజేసేందుకు చర్చలు జరుపుతున్నారట. నటనపై ఉన్న ఆసక్తి తో బ్రహ్మీ సీరియల్ లో నటించేందుకు ఒకే చెప్పే అవకాశం ఎక్కువ ఉందని సినీ జనాలు అంటున్నారు. బుల్లి తెర నుండి వెండి తెరకు వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. కానీ వెండి తెరపై స్టార్ క్రేజ్ దక్కించుకున్న బ్రహ్మీ మాత్రం ఇప్పుడు బుల్లి తెరపై ఎంట్రీ ఇవ్వనున్నాడు. మరి బుల్లి తెరపై బ్రహ్మీ సందడి విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో.