Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న స్టార్ కాంబినేషన్..!

By:  Tupaki Desk   |   22 May 2021 4:00 PM IST
ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న స్టార్ కాంబినేషన్..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ అంటే పూరీ జగన్నాథ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాల్లో కంటెంట్ అలా మెయింటైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ - టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో 'లైగర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఫస్ట్ విజయ్ తో పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్నాడు పూరీ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి లైగర్ సినిమాకు ప్రతిసారి కరోనా మహమ్మారి అవరోధంగా నిలుస్తుంది. గతేడాది షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదల కావాల్సిన సినిమాను ఈ ఏడాదికి వాయిదా పడేలా చేసింది.

ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి డైరెక్టర్ పూరీ లైగర్ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిపేసి ముంబై నుండి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది బృందం. స్పోర్ట్స్ డ్రామా కావడంతో పూరీ జగన్నాథ్ లైగర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే వరుస ప్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్టు పడటంతో అదే సక్సెస్ లైగర్ తో కూడా కంటిన్యూ చేయాలనీ అనుకుంటున్నాడట పూరీ. అయితే హైదరాబాద్ లో షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కాబట్టి డైరెక్టర్ పూరీ టైం వృధా చేయకుండా లైగర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు టాక్. ఈ సినిమాను పూరీతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా పూరీ జగన్నాథ్ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు హల్చల్ చేస్తున్నాయి. విషయం ఏంటంటే.. పూరీ జగన్నాథ్ తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే అని. అలాగే ఆ సినిమా కూడా కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన కన్నడ స్టార్ యష్ తో తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్ గురించి పుకార్లు వచ్చాయి. కానీ ఈసారి పూరీ చెప్పిన కథకు యష్ కూడా సానుకూలంగా స్పందించాడని.. అలాగే కాంబినేషన్ కూడా సెట్ అయినట్లు టాక్ నడుస్తుంది. మరి ఇప్పటివరకు యష్ కూడా కేజీఎఫ్-2 తర్వాత తదుపరి సినిమా ఏంటనేది ప్రకటించలేదు. అలాగే పూరీ కూడా ఇదివరకు కన్నడలో సూపర్ హిట్స్ అందుకున్నాడు. మరి ఈ లెక్కన నిజంగానే కాంబో సెట్ అయ్యిందేమో అని ఇండస్ట్రీ వర్గాలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి వీరిద్దరి నుండి రెస్పాన్స్ రావాల్సి ఉంది.