Begin typing your search above and press return to search.

రకుల్​ తొలి అనుభవం అదే..!

By:  Tupaki Desk   |   12 Nov 2020 6:00 AM GMT
రకుల్​ తొలి అనుభవం అదే..!
X
రకుల్​ ప్రీత్​సింగ్​ తెలుగులో నిన్న మొన్నటి వరకు స్టార్​ హీరోయిన్​. ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గినా తన చేతిలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్కువగా ఆమె తమిళ సినిమాలు, హిందీ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. తెలుగులో ఆమె ఖాతాలో సరైన హిట్టు పడి కూడా చాలా రోజులైంది. పూజా హెగ్డే, రష్మిక మందన్న జోరుతో ఆమెకు అవకాశాలు చాలా తగ్గాయి. కాగా తాను నటనవైపు ఎందుకొచ్చిందో? తొలిరోజు షూటింగ్​లో ఎదుర్కొన్న అనుభవాలేమిటో రకుల్ మీడియాతో పంచుకున్నది. మొదటి రోజు ఏ నటికైనా, నటుడికైనా కాస్త టెన్షన్ ఉండటం కామనే.. రకుల్​ కూడా అలాగే టెన్షన్​ పడిందట.

‘అప్పుడు నేను ఢిల్లీలో డిగ్రీ చదువుతున్నాను. అనుకోకుండా కన్నడ మూవీ నుంచి ఆఫర్ వచ్చింది. అప్పటివరకు సినిమాలపై పెద్దగా అవగాహన లేదు. కేవలం హిందీ సినిమాలు మాత్రమే తెలుసు.. సౌత్​లో కూడా ఇండస్ట్రీ ఉంటుందని తెలియదు. దీంతో నేను షూటింగ్ కు ఒక్క రోజు ముందు మాత్రమే వెళ్లాను. హీరో బైక్ పై ఉన్నారు. నేను వెనక నుంచి నడుస్తుంటాను. అతడు నా వైపు సీరియస్ గా చూసి నన్ను ఫాలో అవ్వొద్దు అంటాడు. నేను మళ్లీ వెనక్కి వచ్చేయాలి. ఆ సీన్ నా ఫస్ట్ షాట్. బాగా చేశానని అంతా మెచ్చుకున్నారు. అప్పుడు నా వయసు 18’ అని చెప్పుకొచ్చింది రకుల్​. దీంతో పాటు మరిన్ని విషయాలు కూడా మీడియాతో పంచుకున్నది. 'నిజానికి నేను ముందు బాలీవుడ్​లో యారియాన్ అనే చిత్రంలో నటించా. కానీ ఆ సినిమా కంటే తెలుగు సినిమా ముందు రిలీజ్​ అయ్యింది. దీంతో టాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. వాటిని ఒప్పుకున్నాను. అలా టాలీవుడ్ కు ఫిక్స్ అయిపోయాను. అని రకుల్ చెప్పింది.