Begin typing your search above and press return to search.

'నవరస' కోసం స్టార్‌ హీరోలు స్టార్‌‌ డైరెక్టర్స్‌

By:  Tupaki Desk   |   24 Sep 2020 12:30 AM GMT
నవరస కోసం స్టార్‌ హీరోలు స్టార్‌‌ డైరెక్టర్స్‌
X
తమిళ లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం 'నవరస' అనే వెబ్‌ సిరీస్‌ ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. 9 ఎపిసోడ్స్‌ గా ఉండే ఈ వెబ్‌ సిరీస్‌ కు మణిరత్నంతో కలిపి మొత్తం 9 మంది దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్కో ఎపిసోడ్‌ లో ఒక్కో రసం గురించి చూపించే అవకాశం ఉందని టాక్‌. తమిళంతో పాటు హిందీ మరియు తెలుగు ప్రేక్షకులు ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మేరకు షూటింగ్‌ జరుపుకున్న ఈ వెబ్‌ సిరీస్‌ కు మణిరత్నంతో పాటు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌.. కేవీ ఆనంద్‌.. కార్తీక్‌ నరేన్‌.. రతీంద్రన్‌ ప్రసాద్‌.. పొన్రం మరియు బోజోయ్‌ నంబియర్‌ లు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడుగురితో పాటు స్టార్‌ నటులు అయిన అరవింద్‌ స్వామి మరియు సిద్దార్థలు కూడా ఒక్కో ఎపిసోడ్‌ చొప్పున దర్శకత్వం వహించబోతున్నారు.

ఈ వెబ్‌ సిరీస్‌ లో ఒక ఎపిసోడ్‌ కు అరవింద్‌ స్వామి దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సూర్య.. దుల్కర్‌ సల్మాన్‌ మరియు విజయ్‌ సేతుపతి వంటి స్టార్‌ హీరోలు ఈ వెబ్‌ సిరీస్‌ లో కనిపించబోతున్నారు. జర్నీ ఫేం జై మరియు సౌత్‌ లో సుపరిచితం అయిన హీరోయిన్‌ స్నేహా మలయాళ హీరోయిన్‌ పార్వతి తిరువొత్తులు ఇందులో నటింస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై స్ట్రీమింగ్‌ కాబోతుంది. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ విడుదల తేదీ విషయంతో పాటు ఇతర అన్ని విషయాలపై దర్శకుడు మణిరత్నం క్లారిటీ ఇవ్వబోతున్నాడు.