Begin typing your search above and press return to search.
'ఎన్కౌంటర్ రవి'గా మారిన స్టార్ యాక్టర్.. వైరల్ లుక్!!
By: Tupaki Desk | 7 Jan 2021 8:06 AM GMTసందీప్ కిషన్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్నేహగీతం సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సందీప్, వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా చేస్తూనే ఉన్నాడు కానీ వరుస హిట్స్ మాత్రం పడలేదు. ఒక హిట్ పడింది అనేసరికి నెక్స్ట్ సినిమా ప్లాప్.. ఇలా కెరీర్ సాగించుకుంటూ వస్తున్నాడు. ఎక్కువగా ఫెయిల్ అయినా సరేగాని రొటీన్ సినిమాలు మాత్రం సందీప్ చేయడం లేదు. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాలో ఏదొక వైవిధ్యం కనబరుస్తూనే ఉన్నాడు. ఇక ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్.. చాలారోజుల తర్వాత నిను వీడని నీడను నేనే అంటూ ఓ హిట్ అందుకున్నాడు. అంతేగాక అదే సినిమాతో సందీప్ నిర్మాతగా కూడా మారాడు.
తాజాగా సందీప్ హీరోగా నటిస్తున్న సినిమా రౌడీబేబీ. గత నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న రౌడీ బేబీ మూవీ టీమ్. తాజాగా తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. నేహాశెట్టి హీరోయిన్ కాగా రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక బాబీ సింహ పోస్టర్ చూస్తే ఎడమ చేతిలో టీ గ్లాస్ పట్టుకొని, కుడి చేతిలో ఫైల్స్ తిరగేస్తున్న పోలీస్ గెటప్ లో అదరగొట్టేసాడు. కోరమీసం కలిగిన ఎన్కౌంటర్ రవి పాత్రలో కనిపించనున్నాడు సింహ. సీరియస్ లుక్కు చూస్తుంటే సినిమాలో సిన్సియర్ పోలీస్ అని అర్ధమవుతుంది. ఇటీవల షూటింగ్ లో పాల్గొన్నాడట. ఇదిలా ఉండగా.. కోన వెంకట్ సమర్పణలో ఎంవివి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సీనియర్ డైరెక్టర్ జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.