Begin typing your search above and press return to search.

స్టార్ యాక్టర్ పోలీస్ గెటప్ లుక్ వైరల్..!

By:  Tupaki Desk   |   29 April 2021 12:30 PM GMT
స్టార్ యాక్టర్ పోలీస్ గెటప్ లుక్ వైరల్..!
X
టాలెంటెడ్ కోలీవుడ్ డైరెక్టర్ కం యాక్టర్ సముద్రఖని.. ప్రస్తుతం రోజురోజుకి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే చేతినిండా సినిమాలు కలిగి ఉన్నటువంటి సముద్రఖని.. సినీరచయితగా దర్శకుడుగా తమిళ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇప్పుడు దర్శకత్వం పక్కనపెట్టి నటుడిగా స్టార్డం అందుకుంటున్నాడు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో విలన్ గా మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని.. ప్రస్తుతం భారీ సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోవైపు ప్రధాన నటుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే క్రాక్ తో అలరించిన ఆయన ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. తాజాగా సముద్రఖని ప్రధానపాత్రలో నటిస్తున్న 'రైటర్' మూవీ స్టిల్స్ బయటికి వచ్చాయి. ఫ్రాంక్లిన్ జాకబ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సముద్రఖని పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది. పోలీస్ యూనిఫామ్ లో ఆయన పవర్ ఫుల్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ మరియు లిటిల్ రెడ్ కార్ ఫిల్మ్స్ లతో పాటుగా డైరెక్టర్ పా.రంజిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఏకకాలంలో సముద్రఖని చాలా సినిమాలు లైన్ లో పెట్టేసాడు. ఇటీవలే పంచతంత్రం సినిమాలో ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తానికి సముద్రఖని మేకింగ్ వదిలేసి నటుడుగా సక్సెస్ అందుకుంటున్నాడు.