Begin typing your search above and press return to search.
బాడీ షేమింగ్ చేసిన వ్యక్తికి స్టార్ నటుడి కూతురు వార్నింగ్
By: Tupaki Desk | 7 Jun 2023 9:01 PMసోషల్ మీడియా లో సెలబ్రెటీల కు అప్పుడప్పుడు చేదు అనుభవం ఎదురు అవుతూ ఉంటుంది. డ్రెస్ విషయం లో లేదంటే వ్యక్తిగత విషయం లో ట్రోల్స్ చేసే వారు చాలా మంది ఉంటారు. సోషల్ మీడియా లో సెలబ్రిటీల దృష్టిలో పడేందుకు కొందరు ఆకతాయిలు బూతులు కామెంట్స్ చేస్తూ కొందరి కోపాని కి గురి అవుతూ ఉంటారు.
తాజాగా మలయాళ స్టార్ నటుడు సురేష్ గోపీ కూతురు భాగ్య ను సోషల్ మీడియా లో ఒక ఆకతాయి బాడీ షేమింగ్ చేసి తీవ్రంగా మనసు గాయపర్చాడు. ఆమె అందుకు ఘాటుగానే సమాధానం ఇచ్చింది. భాగ్య ఇచ్చిన కౌంటర్ తో చాలా మంది నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బాడీ షేమింగ్ చేసే వారి పట్ల ఇలాగే వ్యవహరించాలని ఆమె కు మద్దతు తెలియజేయడం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... సురేష్ గోపి కూతురు భాగ్య ఇటీవల కెనడా లోని ఓ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పట్టాను తీసుకున్న సమయం లో దిగిన ఫోటోల ను ఆమె షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోల కు ఒక నెటిజన్.. శుభాకాంక్షలు.. మీరు ఇక పై చీరలు పక్కన పెట్టి వెస్ట్రన్ డ్రెస్ లు వేసుకోవాలి. ఎందుకంటే లావుగా ఉన్నవారు చీరలు కడితే బాగుండవు. చీరలు మీకు సెట్ అవ్వడం లేదు. వెస్ట్రన్ దుస్తుల్లో మీరు చాలా బాగుంటారు అంటూ కామెంట్ పెట్టాడు.
ఆ కామెంట్ కు భాగ్య స్పందిస్తూ... మీ ఉచిత సలహా కు ధన్యవాదాలు. నా వెయిట్ మీకు సంబంధించిన విషయం అస్సలు కాదు. కనుక మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటాను. కేరళ సంస్కృతికి తగ్గట్లుగా నేను గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ధరించాను. ఇతరుల మాదిరిగా ఎబెట్టు డ్రెస్ లు వేసుకోలేదు. ఇలాంటి కామెంట్స్ చేయడం మానేసి మీ పని పై మీరు దృష్టిని పెడితే బాగుంటుంది అంటూ ఆమె వార్నింగ్ ఇచ్చింది.
భాగ్య సోషల్ మీడియా రెస్పాన్స్ కు సురేష్ గోపీ అభిమానుల తో పాటు చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సురేష్ గోపి యొక్క కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలయాళం లో సీనియర్ మోస్ట్ స్టార్. తెలుగు లో ఎన్నో డబ్బింగ్ సినిమాల తో సుపరిచితుడు. భాగ్య కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని అప్పట్లో కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ఆమె కు ఆసక్తి లేనట్లు వార్తలు వచ్చాయి.