Begin typing your search above and press return to search.

మహేష్‌.. త్రివిక్రమ్‌ మూవీ నేపథ్యం ఏంటంటే..!

By:  Tupaki Desk   |   10 Aug 2021 7:31 AM GMT
మహేష్‌.. త్రివిక్రమ్‌ మూవీ నేపథ్యం ఏంటంటే..!
X
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. మహేష్‌ పుట్టిన రోజు సందర్బంగా సినిమా కాస్ట్‌ అండ్‌ క్రూను అధికారికంగా ప్రకటించారు. సినిమా ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఆసక్తిగా ఉన్న ఈ సమయంలో నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ముఖ్యంగా సినిమా జోనర్ విషయంలో నిర్మాత నాగవంశీ ఉన్న సస్పెన్స్‌ కు తెర దించినట్లుగా అయ్యింది.

మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్‌ మీడియా వేదిక ట్విట్టర్ లో అభిమానులు స్పేస్‌ సెషన్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రదీప్ హోస్ట్‌ గా వ్యవహరించాడు. మహేష్‌ బాబు అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఇక పలువురు నిర్మాతలు దర్శకులు నటీ నటులతో పాటు నమ్రత మరియు సితారలు కూడా మాట్లాడారు. ఆ సమయంలోనే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ త్రివిక్రమ్.. మహేష్‌ బాబుల కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానుల సమక్షంలో పంచుకున్నాడు.

మహేష్‌బాబు28 మూవీ అతడు, ఖలేజాలను మించిన మాస్ సినిమా నిలుస్తుందన్నాడు. యాక్షన్‌ జోనర్‌ లో రూపొందుతున్న ఈ సినిమా లో మాస్ ఎలిమెంట్స్ కావాల్సినంత ఉంటాయని నిర్మాత నాగవంశీ పేర్కొన్నాడు. ఇక సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేస్తామని.. ఖచ్చితంగా త్రివిక్రమ్‌.. మహేష్‌ బాబుల సినిమా ఇండస్ట్రీ హిట్‌ గా నిలుస్తుందనే నమ్మకంను కూడా ఆయన వ్యక్తం చేశాడు. సినిమా సూపర్ డూపర్‌ ఇండస్ట్రీ హిట్‌ అయిన తర్వాత మళ్లీ ఇదే ట్విట్టర్ స్పేస్‌ లో అభిమానులతో ముచ్చటిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలతో #SSMB28 పై అంచనాలు మరింతగా పెరిగాయి.