Begin typing your search above and press return to search.

SSMB28: మరో పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం సీనియర్ స్టార్?

By:  Tupaki Desk   |   17 Jan 2023 7:50 AM GMT
SSMB28: మరో పవర్ఫుల్ క్యారెక్టర్ కోసం సీనియర్ స్టార్?
X
మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఆయన చేసిన ప్రతీ సినిమాలో హీరోహీరోయిన్ల తర్వాత ఓ కీలక పాత్ర కూడా ఉంటుంది. అది అత్త, తల్లి, స్నేహితుడు, తాతయ్య ఎవరైనా కావొచ్చు. అత్తారింటికి దారేదిలో హీరో పవన్ కల్యాణ్ కు.. నదియా అత్తగా కనిపించిన మెప్పించింది. అల వైకుంఠపురం సినిమాలో టబు తల్లి పాత్రలో నటించి చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28లో కూడా ఓ ముఖ్యమైన మహిళ పాత్రను రాసినట్లు సమాచారం.

అయితే ఈ సినిమాలో హీరో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల కనిపించబోతున్నారు. అయితే కీలక పాత్ర పోషించబోతున్న మహిళ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ఈ చిత్రంలో పాత్ర కోసం సీనియర్ నటి శోభనను త్రివిక్రమ్ సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోకపోతే.. అతను మరో పాత హీరోయిన్ ను సినిమాలో పెట్టుకోవాలని భావిస్తున్నారట.

ఈ సినిమా రెగ్యులర్ ప్రొడక్షన్ జనవరి 18వ తేదీన నుంచి ప్రారంభం కాబోతుందని ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. అయితే ముందుగా యాక్షన్ ఎపిసోడ్ తోనే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో టాకీ పార్ట్ ప్రారంభం కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై మహేష్ - త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా చాలా రోజుల కిందటే ఖరారైంది. కానీ షూటింగ్ విషయంలో జాప్యం జరిగింది. అయితే ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేస్తామని చిత్రబృందం ముందుగానే ప్రకటించింది.

అతడు, ఖలేజా తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మిల్క్ బాయ్ చేస్తున్న 28వ చిత్రం ఏ రేంజ్ లో మెప్పించనుందో తెలియాలంటే ఇంకా చాలా కాలం ఆగాల్సిందే. అలాగే ఈ సినిమాలో హీరోహీరోయిన్ల తర్వాత కీలక పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం తెలియాలంటే కూడా ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.