Begin typing your search above and press return to search.

#SSMB28 : సెకండ్ విషయంలో ఊగిసలాట

By:  Tupaki Desk   |   15 Nov 2021 4:10 AM GMT
#SSMB28 : సెకండ్ విషయంలో ఊగిసలాట
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో సినిమా వచ్చి పదేళ్లకు పైగా అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో సినిమా రాబోతుంది. అతడు.. ఖలేజా సినిమాలు కమర్షియల్‌ గా మంచి విజయాన్ని అందుకోలేక పోయినా కూడా ఇప్పటికి ఆ సినిమాల గురించి మాట్లాడుకునేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. మళ్లీ వీరి కాంబోలో ఇన్నాళ్ల తర్వాత సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డులు బ్రేక్‌ చేసేలా వీరి కాంబో మూవీ ఉంటుందనే అప్పుడే అభిమానులు నమ్మకం పెట్టుకుంటున్నారు. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమా చిత్రీకరణ మరో నెల రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. సర్కారు వారి పాట చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల చివరి వరకు సర్కారు వారి పాట సినిమా కు గుమ్మడి కాయ కొట్టి త్రివిక్రమ్ మూవీకి కొబ్బరి కాయ కొట్టేలా మహేష్‌ బాబు ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మరో వైపు త్రివిక్రమ్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ను కూడా చక చక చేస్తున్నారట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక తుది దశకు చేరినట్లుగా చెబుతున్నారు. హీరోయిన్ గా పూజా నటించబోతుందట. త్రివిక్రమ్‌ సినిమా అంటే రెండవ హీరోయిన్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా రెండవ హీరోయిన్ పాత్ర ఉండబోతుంది. ఆ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారు అనుకుంటూ ఉండగా ఆ మద్య నభా నటేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాని ఇప్పుడు ఆమె కాదు ఆ సెకండ్‌ హీరోయిన్ పాత్రను లావణ్య త్రిపాఠి తో చేయించేందుకు సిద్దం అయ్యారని అంటున్నారు. లావణ్య త్రిపాఠితో ఇటీవలే త్రివిక్రమ్ టీమ్ మాట్లాడారని.. ఆమె కూడా ఓకే అన్నారట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రెగ్యులర్ గా త్రివిక్రమ్‌ సినిమా లో సెకండ్ హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది. కాని ఈసారి మాత్రం అలా కాకుండా సినిమా లో సెకండ్ హీరోయిన్ పాత్రకు కథలో కీలక ప్రాముఖ్యత ఉంటుందట. అయితే ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం కనిపించని ఆ సెకండ్ హీరోయిన్ పాత్ర సెంకండ్‌ హాఫ్ లో మాత్రమే కనిపించబోతుందట. కథ లో కీలకమైన టర్నింగ్‌ పాయింట్‌ తో సెకండ్‌ హీరోయిన్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. సెకండ్ హీరోయిన్ పాత్రకు లావణ్య త్రిపాఠి ని ఎంపిక చేసే విషయంలో దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని నభా నటేష్ ను కూడా సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మేకర్స్ వీరిద్దరి మద్య ఊగిసలాటలో ఉన్నట్లుగా అనిపిస్తుందని మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. షూటింగ్ ప్రారంభం అయ్యే నాటికి ఇద్దరిలో ఒకరిని ఫైనల్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.