Begin typing your search above and press return to search.

SSMB28 ఆ రూమర్ పై క్లారిటీ

By:  Tupaki Desk   |   17 Nov 2021 2:30 PM GMT
SSMB28 ఆ రూమర్ పై క్లారిటీ
X
సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రీకరణ జరుగుతోంది. చివరి దశలో ఉన్న ఆ సినిమా ఈ నెల చివరి వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సినిమాను ఏప్రిల్‌ లో విడుదల చేస్తారు. సర్కారు వారి పాట షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే మహేష్‌ బాబు తన తదుపరి సినిమాను త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్రివిక్రమ్‌ మరియు మహేష్‌ ల కాంబో మూవీ కోసం దాదాపుగా పదేళ్లుగా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. ఎట్టకేలకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందే ఎన్నో పుకార్లు ఈ సినిమా గురించి వస్తున్నాయి.

గత రెండు మూడు రోజులుగా ప్రథానంగా ఒక పుకారు ఈ సినిమా గురించి వినిపిస్తుంది. అదేంటి అంటే సినిమాలో ప్రథమ హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటించబోతుండగా సెకండ్‌ హీరోయిన్ గా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి. లావణ్య త్రిపాఠి మరియు మహేష్‌ బాబు కాంబోలో మంచి సన్నివేశాలు కూడా ఉంటాయని.. ఈ సినిమాతో లావణ్య త్రిపాఠికి బిగ్‌ బ్రేక్ ఖాయం అంటూ సోషల్‌ మీడియాలో టాక్. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి స్పందించింది. సన్నిహితులతో మహేష్‌ బాబు సినిమాలో నటించడం లేదంటూ తేల్చి చెప్పిందట. మీడియాకు కూడా ఆ సమాచారం అందింది. ఇప్పటి వరకు కనీసం మహేష్‌ బాబు.. త్రివిక్రమ్‌ మూవీ టీమ్ కూడా లావణ్య త్రిపాఠిని సంప్రదించిన దాఖలాలు లేవని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు ఈ పుకార్లను పుట్టించారని అంటున్నారు.

లావణ్య త్రిపాఠి తెలుగు లో ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉండగా మరో వైపు ఇతర భాషల్లో కూడా ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. అందాల రాక్షసి సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికి ఈమె సినిమాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మహేష్‌ బాబు మూవీలో ఆఫర్‌ వచ్చిందంటూ వార్తలు రావడంతో ఆమె కెరీర్‌ టర్న్‌ అయినట్లే అని అంతా అనుకున్నారు. కాని ఆ వార్తలు పుకార్లే అని తేలిపోయాయి. త్రివిక్రమ్‌ మూవీ అంటే ఖచ్చితంగా సెకండ్‌ హీరోయిన్‌ ఉంటుంది. ప్రాముఖ్యత ఉన్నా లేకున్నా కూడా త్రివిక్రమ్‌ మూవీలో ఒక హీరోయిన్‌ అంటే ఖచ్చితంగా బజ్ ఉంటుంది. కనుక ఆ హీరోయిన్‌ గా ఎవరు నటిస్తారు అనేది చూడాలి.