Begin typing your search above and press return to search.

ఈరోజే '#SSMB28' అనౌన్స్ మెంట్..!

By:  Tupaki Desk   |   1 May 2021 6:11 AM GMT
ఈరోజే #SSMB28 అనౌన్స్ మెంట్..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న మహేష్.. వెంటనే త్రివిక్రమ్ తో '#SSMB28' ప్రాజెక్ట్ చేస్తారని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించబడుతుంది. మే 31న నటశేఖర కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్సమెంట్ ఉండే అవకాశం ఉందని ఈ మధ్య చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుంది ఈ రోజే(మే 1) 'మహేష్-త్రివిక్రమ్' ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన ఉంటుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఇంతకుముందు 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాలు వచ్చాయి. ఒకటి హిట్ అయింది.. మరొకటి ప్లాప్ అయింది. అయినప్పటికీ ఈ కాంబో పై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఈ రెండు సినిమాలు మహేష్ ని కొత్తగా ప్రెజెంట్ చేశాయి. ముఖ్యంగా 'ఖలేజా' మూవీ ఆయనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసింది. అప్పటి నుంచే సూపర్ స్టార్ సినిమాలలో కొత్త రకం ఎంటర్టైన్మెంట్ కనిపిస్తోంది. అందుకే ఈ సెన్సేషనల్ కాంబో పై మరో సినిమా రావాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పదేళ్ల తర్వాత త్రివిక్రమ్ - మహేష్ కలిసి సినిమా కోసం వర్క్ చేయబోతున్నారు. రాజమౌళి తో చేయబోయే సినిమా కంటే ముందే త్రివిక్రమ్ తో సినిమాని లైన్ లో పెట్టుకున్నారు మహేష్. ఈరోజు ఏ సమయంలోనైనా ఈ మోస్ట్ అవైటెడ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా అనౌన్సమెంట్ రావొచ్చని సినీ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. దీని కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మహేష్ ఫ్యాన్స్ ఎలాంటి ప్లాన్స్ లేకుండా '#SSMB28' హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్స్ లో నిలిపారు. మరి ఏ టైంలో బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ ఉంటుందో చూడాలి.