Begin typing your search above and press return to search.

పూజా టూమ‌చ్ క‌మ‌ర్షియ‌ల్ అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ సీరియస్

By:  Tupaki Desk   |   10 Aug 2021 9:30 AM GMT
పూజా టూమ‌చ్ క‌మ‌ర్షియ‌ల్ అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ సీరియస్
X
మ‌నిషిలో క‌మ‌ర్షియ‌ల్ వాస‌న ఇట్టే ప‌ట్టేయొచ్చు. ప్ర‌తిదానికి బిజినెస్ మాట్లాడే త‌త్వం కొంద‌రికి ఉంటుంది. నేటి మనీ మైండెడ్ లోకంలో ఇవ‌న్నీ కామ‌నే క‌దా! అని భావిస్తాం కానీ .. నేటిత‌రం క‌థానాయిక‌లు టూమ‌చ్ క‌మ‌ర్షియ‌ల్ గా ఉన్నారు అన్న విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి.

తాజాగా బుట్ట‌బొమ్మలోని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ ఫ్యాన్స్ లో తిక్క రేపింది. 9 ఆగష్టు 2021 సూపర్ స్టార్ మహేష్ 46వ పుట్టినరోజు సందర్భంగా సెల‌బ్రిటీలంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మ‌హేష్ న‌టిస్తున్న‌ `సర్కారు వారి పాట` టీజ‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ముఖ్యంగా మ‌హేష్ ఛామింగ్ లుక్ గురించి ప్ర‌తిభ గురించి ప్ర‌ముఖులంతా పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

చివ‌రికి `స‌ర్కార్ వారి పాట` క‌థానాయిక కీర్తి సురేష్ సైతం ``ఆయ‌న‌కు ప్ర‌తిరోజూ రాత్రి దిష్ఠి తీయండి ప్లీజ్`` అంటూ న‌మ్ర‌త‌ను అభ్య‌ర్థిస్తూ మ‌హేష్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే మ‌హ‌ర్షి లాంటి హిట్ చిత్రంలో న‌టించిన పూజాహెగ్డే మాత్రం అస్స‌లు మ‌హేష్ గురించి స్పందించ‌నే లేదు. క‌నీస‌మాత్రంగా అయినా శుభాకాంక్ష‌లు తెలపాల‌నే సెన్స్ త‌న‌కు లేద‌ని మ‌హేష్ అభిమానులు నొచ్చుకున్నారు.

అయితే ఇంత‌లోనే పూజా హెగ్డే ని SSMB28 క‌థానాయిక‌గా ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే పూజాకి మ‌హేష్ పై ఎక్క‌డా లేని ప్రేమ పుట్టుకొచ్చి త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే ఇంత ఆల‌స్యంగా పూజాకి ప్రేమ పుట్టుకొచ్చిందా? తాను `చాలా కమర్షియల్` అని మ‌హేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మహేశ్ అభిమానులు SSMB28 లో క‌థానాయ‌కురాలిగా అధికారికంగా ప్రకటించే వరకు మహేష్ ని ప‌ట్టించుకోని కారణంగా సీరియ‌స్ గా ఉన్నారు.

పూజా మ‌హేష్ కి విషెస్ చెబుతూ..``పుట్టినరోజు శుభాకాంక్షలు @యువ‌ర్స్ మ‌హేష్ .. మరొక బ్లాక్ బస్టర్ కోసం ఆశిస్తున్నాను. ముఖ్యంగా సెట్లలో ఆనందించండి. ఈ సంవత్సరం చాలా విజయాలతో నిండి ఉంటుందని ఆశిస్తున్నాను. మీతో మ‌రోసారి న‌టించ‌డం సంతోషంగా ఉంది! #త్రివిక్రమ్ సర్ .. హరికహాసిన్... రౌండ్ 3 .. వెళ్దాం`` అని ఆమె ట్వీట్ చేసింది. SSMB28 మహేష్ - పూజా జంట‌గా న‌టిస్తున్న రెండో సినిమా ఇది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.