Begin typing your search above and press return to search.
అల..కు మించి సర్కారు వారి పాటలు
By: Tupaki Desk | 18 Dec 2020 11:39 AM ISTఈ ఏడాది రికార్డులన్నీ కూడా అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకే దక్కాయి అనడంలో సందేహం లేదు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే టాప్ నిలవడం కాకుండా సౌత్ ఇండియన్ పాటల్లో టాప్ గా ఈ పాటలు నిలిచాయి. అల వైకుంఠపురంలో అన్ని పాటలు కూడా ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నాయి. యూట్యూబ్ లో వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న అల వైకుంఠపురంలో సినిమా పాటలకు థమస్ సంగీతాన్ని అందించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట కు సంగీతాన్ని అందిస్తున్నాడు.
షూటింగ్ ప్రారంభంకు ఆలస్యం అవుతున్నా కూడా పాటల విషయంలో మాత్రం థమన్ జోరు మీదున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ దాదాపుగా పూర్తి అయ్యాయి. పది ట్యూన్స్ ను రెడీ చేసిన థమన్ వాటిలో నుండి అయిదు ఆరు బెస్ట్ ను మహేష్ ముందు ఉంచబోతున్నాడట. అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలకు ఏమాత్రం తగ్గకుండా ఇంకాస్త బెటర్ గా ఉండేలానే ఈ సినిమా కోసం థమన్ పాటలను ట్యూన్ చేశాడంటున్నారు.
టాలీవుడ్ లో థమన్ కు మొదటి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో మహేష్ బాబు. ఆ కారణంగానే మహేష్ పై థమన్ కు ప్రత్యేకమైన అభిమానం ఎప్పుడూ ఉంటుంది. అందుకే సర్కారు వారి పాట సినిమాకు అంతకు మించి కాకుండా అల కు మించి అన్నట్లుగా ట్యూన్ చేస్తున్నాడట. ముఖ్యంగా ఈ సినిమాలోని ఐటెం సాంగ్ ఓ రేండేళ్ల పాటు మారు మ్రోగేలా ట్యూన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాదిలో సర్కారు వారి పాట సినిమా పాటలు ట్రెండ్ అవ్వనున్నాయేమో చూడాలి.