Begin typing your search above and press return to search.

కొడుకు వదిలేసిన సినిమాకు జక్కన్న గుడ్‌ లక్‌

By:  Tupaki Desk   |   6 March 2021 3:30 AM GMT
కొడుకు వదిలేసిన సినిమాకు జక్కన్న గుడ్‌ లక్‌
X
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయకు దర్శకత్వం కంటే కూడా ఎక్కువ ఆసక్తి నిర్మాణంపై అనే విషయం తెల్సిందే. ఆయన సినిమా ల నిర్మాణంతో పాటు పబ్లిసిటీ కి సంబంధించిన వ్యవహారాలను ఇంట్రెస్ట్‌ గా చూసుకుంటూ ఉంటాడు. కార్తికేయ తన సన్నిహితులతో కలిసి నిర్మాతగా 'ఆకాశవాణి' అనే సినిమా ను మొదలు పెట్టారు. దాదాపుగా మూడేళ్ల క్రితం ప్రకటన వచ్చిన ఆకాశవాణి సినిమా వరుసగా ఏదో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఆర్‌ఆర్ఆర్‌ సినిమా సాకుగా చెప్పి ఆకాశవాణి సినిమా నుండి తాను తప్పుకుంటున్నట్లుగా జక్కన్న తనయుడు కార్తికేయ ఏకంగా పెద్ద ప్రెస్‌ నోట్‌ ను విడుదల చేసి ప్రకటించాడు. సినిమా మేకర్స్‌ తో కార్తికేయకు గొడవలు రావడం వల్లే తప్పుకున్నారేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వచ్చింది.

కార్తికేయ తప్పుకున్న తర్వాత ఆకాశవాణి సినిమా మళ్లీ మొదలై పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని అనూహ్యంగా సినిమా ను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేస్తున్నట్లుగా టీజర్‌ విడుదల సందర్బంగా మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ఆకాశవాణి టీజర్ కు జక్కన్న రాజమౌళి నుండి ప్రశంసలు దక్కాయి. అద్బుతమైన విజువల్స్ మరియు సౌండ్. అశ్విన్‌ మొదటి సారి తెరకెక్కించిన ఈ సినిమాను చూసేందుకు తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చిన జక్కన్న రాజమౌళి యూనిట్‌ సభ్యులందరికి కూడా గుడ్‌ లక్‌ చెప్పాడు. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా టీజర్‌ లో ఆకాశవాణి టీమ్‌ క్లారిటీ ఇచ్చారు. సినిమా ను థియేటర్లలోనే విడుదల చేస్తామంటూ మరోసారి యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.