Begin typing your search above and press return to search.
రాజమౌళి అంగీకరించలేకపోయిన ప్రశంస
By: Tupaki Desk | 12 Aug 2015 7:00 AM GMTబాహుబలి సినిమాకు సంబంధించి సినీ పరిశ్రమ మొదలుకుని రాజకీయ, వ్యాపార రంగాల వరకు ఎందరో పెద్ద పెద్ద వాళ్లు ప్రశంసలు కురిపించారు. రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. ఐతే ఆ ప్రశంసలన్నింటినీ అంగీకరించిన రాజమౌళి.. తాజాగా వచ్చిన ఓ ప్రశంసను మాత్రం అంగీకరించలేకపోయాడు. ఆ ప్రశంసలు చూసి నా వల్ల కాదు.. వీటిని అంగీకరించే ధైర్యం నాకు లేదు బాబోయ్ అనేశాడు. ఇంతకీ రాజమౌళిని అంతలా పొగిడేసిన వ్యక్తి ఎవరో తెలుసా... ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తు. ఐదుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ దిగ్గజ రచయిత ‘బాహుబలి’ విషయంలో రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూ ఓ అభినందన పత్రం పంపించారు. అది చూసి జక్కన్న ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు. బాహుబలి తమిళ వెర్షన్ కు మాటలందించింది, ఈ సినిమా కోసం ‘కిలికి’ అనే కొత్త భాషను పుట్టించింది వైరముత్తు తనయుడు మదన్ కర్కీనే కావడం విశేషం.
బాహుబలి చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయానని.. ప్రపంచానికి భారతీయ సినిమాను పరిచయం చేసిన ఘనుడిగా రాజమౌళి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని.. మిగతా ప్రపంచంతో పోటీ పడటానికి మన నుంచి ఒకరు వచ్చారని తాను గర్వంగా చెబుతున్నానని.. వైరముత్తు పేర్కొనడం విశేషం. సినిమాలో ఏ ఏ సందర్భాల్లో తానెలాంటి భావనకు గురైంది వివరంగా చెప్పారు వైరముత్తు. ఆయన లాంటి లెజెండరీ లిరిసిస్ట్ ఈ స్థాయిలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించడం చిన్న విషయం కాదు. ఈ అభినందన పత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ‘‘బాహుబలి విషయంలో ఇప్పటికే చాలా ప్రశంసలు అందుకున్నాను. కానీ తమిళ కవి వైరముత్తు సర్ ప్రశంసలు నన్ను షేక్ చేసేశాయి. వీటిని అంగీకరించేంత ధైర్యం నాకు లేదు. ఆ దిగ్గజం నుంచి ఆశీర్వాదం మాత్రమే తీసుకుంటాను. ఇది ఓ గొప్ప ఉపాధ్యాయుడి నుంచి విద్యార్థి తీసుకునే ఆశీర్వచనం’’ అని పేర్కొన్నాడు రాజమౌళి.