Begin typing your search above and press return to search.

అలా చేస్తే 'ఆర్.ఆర్.ఆర్' 5 గంటల్లో 1200 కోట్లు కలెక్ట్ చేస్తుందా...?

By:  Tupaki Desk   |   4 July 2020 9:30 AM IST
అలా చేస్తే ఆర్.ఆర్.ఆర్ 5 గంటల్లో 1200 కోట్లు కలెక్ట్ చేస్తుందా...?
X
బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటుడిగా కమల్ ఆర్ ఖాన్ కి గొప్ప పేరే వుంది. సినీ విమర్శకుడు అని చెప్పుకునే కేఆర్కే ఇండస్ట్రీ ప్రముఖుల మీదా.. సినిమాలపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు. ముఖ్యంగా మన సౌత్ ఇండియా యాక్టర్స్ పై.. సినిమాలపై ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ మనవారి ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. రానా - ప్రభాస్ లాంటి హీరోలపై.. 'బాహుబలి' 'సాహో' లాంటి సినిమాలపైనా.. రాజమౌళి, సుజిత్ లాంటి దర్శకులపై కూడా విమర్శలు చేసాడు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులు కౌంటర్ అటాక్ చేయడంతో క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇటీవల లెజెండరీ నటులు ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ లు చనిపోతారని నాకు ముందే తెలుసని ట్వీట్స్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమా గురించి కామెంట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్‌ గా తీర్చి దిద్దేందుకు జక్కన్న ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి కరోనా వచ్చి బ్రేక్స్ వేసింది. గత మూడు నెలలుగా సెట్స్ లో అడుగుపెట్టే అవకాశమే లేకుండా చేసింది. ఇలాంటి సమయంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాను పర్సనల్ యాప్‌ లో రిలీజ్ చేస్తారని.. ఆర్జీవీ మాదిరిగా సొంత ఓటీటీ సంస్థను ఏర్పరుచుకుంటారని టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో కమల్ ఆర్ ఖాన్ ట్వీట్ చేస్తూ.. ''రాజమౌళి పర్సనల్ యాప్ ద్వారా పే ఫర్ వ్యూ పద్ధతిలో ఆర్.ఆర్.ఆర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడని కంఫర్మ్ అయింది. 8 భారతీయ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయిస్తారు. ఇలా చేస్తే కేవలం 5 గంటల్లో 1200 కోట్ల రూపాయలు నేరుగా రాజమౌళి ఖాతాలో చేరిపోతాయి'' అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ''ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ చేసే విధానం ఓటీటీలు పర్సనల్ యాప్స్ కలిసి థియేటర్స్, మీడియేటర్స్, బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫిల్మ్ ఛాంబర్స్, నిర్మాతల మండలి మరియు స్టార్స్ ని ఎలా నాశనం చేస్తాయనే దానిని రుజువు చేస్తుంది. రెగ్యులర్ సినిమాల విడుదలకు బదులుగా #RRR ఈ విధానం ద్వారా 3 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తుందనిపిస్తోంది'' అని ట్వీట్ చేసారు కేఆర్కే. దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అని కేఆర్కే పై ఫైర్ అవుతున్నారు. అలా సినిమా రిలీజ్ చేస్తే క్షణాల్లో పైరసీ చేసేస్తారని.. అయినా రాజమౌళి వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మాత్రమే ఆర్.ఆర్.ఆర్ ను తెరకెక్కిస్తున్నాడని.. ఎవరి ఇంట్లో వారు కూర్చొని చూడటానికి కాదని కామెంట్స్ చేస్తున్నారు.