Begin typing your search above and press return to search.
ఏంటిది జక్కన్నా.. అంటున్న జనాలు!
By: Tupaki Desk | 11 April 2020 1:00 PM ISTకోవిడ్-19 ప్రపంచాన్నే కాకుండా భారతదేశాన్ని.. మన తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. ఈ ప్రభావానికి గురికాని వారు అతి తక్కువ మంది ఉన్నారు చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మన తరంలో ఉన్న వారు ఎవరూ కనీవినీ ఎరుగని సమస్య కావడంతో ఎక్కువమందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. సినిమా సెలబ్రిటీల విషయానికి వస్తే ఎక్కువ శాతం మంది ఏదో ఒక రూపంలో విరాళాలు ప్రకటిస్తూ తమ మంచి మనసును చాటుకుంటూ ఉన్నారు. అయితే ఈ తరుణంలో విరాళాలు ప్రకటించని వారు.. మనకెందుకులే అని ఊరుకున్న సెలబ్రిటీలపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ.. ఎస్ ఎస్ రాజమౌళి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
సాధారణంగా ఏదో ఒక హంగామా చేసి వార్తల్లో ఉండే విజయ్ దేవరకొండ కరోనా బాధితులకు సహాయం అందించే విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు. తాపీగా కర్చీఫ్ కట్టుకోండి అని.. పైసా ఖర్చులేని రుమాలు సందేశం ఇచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో నంబర్ వన్ డైరెక్టర్ అని కీర్తింపబడుతున్న రాజమౌళి నిర్మాత దానయ్య తో కలిసి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చానని సోషల్ మీడియాలో ప్రకటించడం తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. భారీగా సంపాదించే డైరెక్టర్ నుంచి ఇలాంటి నామమాత్రపు విరాళం ఎవరూ ఊహించలేదు. కొందరైతే ఈ విరాళం పూర్తిగా దానయ్యే ప్రకటించి ఉంటారని.. రాజమౌళి తన పేరు కూడా జోడించారని ధ్వజమెత్తుతున్నారు.
ఒక సెలబ్రిటీ ఎంత విరాళం ఇవ్వాలి అనే విషయంలో ఎవరు కూడా బలవంత పెట్టలేరు. ఎవరికి తోచినంత వారు ఇస్తారు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో మాత్రం.. జనాలు అటువంటి సాధారణ లాజిక్ లను పట్టించుకోవడం లేదు. విరాళం ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్లు చేస్తున్నారు. అయితే రాజమౌళి అభిమానులు మాత్రం.. ఇది కావాలని కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారం అంటున్నారు. కోట్లకొద్దీ డబ్బు అక్రమంగా సంపాదించిన రాజకీయ నాయకులను.. వ్యాపార వేత్తలను ఎవరూ ఇలా డిమాండ్ చేయడం లేదని.. రాజమౌళి సంపాదించిన ప్రతి పైసాకు ఇన్కమ్ టాక్స్ కడతారని.. అలాంటిది కావాలని రాజమౌళిని ఇలా టార్గెట్ చేయడం సరికాదని అంటున్నారు. విమర్శలకు.. ఈ డిమాండ్లకు తలొగ్గి రాజమౌళి భారీ విరాళం ప్రకటిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక రౌడీ గారి సంగతి కూడా సరేసరి. పుట్టినరోజుకు హిమక్రీములు పంచ డం.. పబ్లిసిటీ దంచుకోవడం కాదు.. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజలకు తోడుగా ఉండాలంటూ నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. మరి రౌడీ గారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.