Begin typing your search above and press return to search.

నిన్న జ‌గ‌ప‌తి నేడు రాజ‌మౌళి కులంపై వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   17 Feb 2023 10:04 AM
నిన్న జ‌గ‌ప‌తి నేడు రాజ‌మౌళి కులంపై వ్యాఖ్య‌లు
X
కులంపై జ‌గ‌ప‌తిబాబు వ్యాఖ్య‌లు ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇంట్లో ప‌ని మ‌నుషుల‌కు కులం అవ‌స‌రం లేదు.. ఆడ‌దాని ద‌గ్గ‌ర ప‌డుకునేందుకు కులం అవ‌స‌రం లేదు.. కానీ పెళ్లి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి కులం అవ‌స‌రం! అని ఘాటుగానే వ్యాఖ్యానించారు.

ఆయ‌న త‌న కుమార్తె ఒక విదేశీ యువ‌కుడిని పెళ్లాడే క్ర‌మంలో త‌న కుల పెద్ద‌ల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై మీడియాలో ఇప్ప‌టికీ క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

ఇంత‌లోనే తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి కూడా కులం గురించి ప్ర‌స్థావించ‌డం హాట్ టాపిక్ గా మారింది. భారతదేశంలోని కుల వ్యవస్థ గురించి ప్రముఖ హాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు రాజమౌళి స‌మాధాన‌మిస్తూ...''నా కుటుంబ సభ్యులు కుల వ్యవస్థకు వ్యతిరేకం. నిజానికి నా కాలేజీకి వెళ్లే వరకు నా కులం ఏమిటో కూడా నాకు తెలియదు.

నా ద‌ర‌ఖాస్తు ఫారమ్ నింపడానికి మా నాన్నగారు వచ్చారు. కులం గురించి అందులో ఒక‌ కాలమ్ కూడా ఉంది. నాన్న‌ దానిని పూరించడానికి నిరాకరించాడు. కుల వ్యవస్థ గురించి నాకు మొదటిసారి అప్పుడే తెలిసింది'' అని అన్నారు.

రాజమౌళి ఎప్పుడూ కులతత్వం గురించి బ‌హిరంగంగా వ్యాఖ్యానించిన‌ది లేదు. ప‌ని చేసే చోటా దీని ప్ర‌స్థావ‌న ఉండ‌దు. ప్ర‌తిభ ఆధారంగా ఆయ‌న ఎంపిక‌లు ఉంటాయి. గ్లోబ‌ల్ సినిమాగా టాలీవుడ్ ఎదుగుతోంది. ఈ ప్ర‌యాణంలో రాజ‌మౌళి కృషి ఎన్న‌టికీ మ‌రువ‌ని చ‌రిత్ర‌గా మారింది.

త‌దుప‌రి జ‌న‌రేష‌న్ రాజ‌మౌళి కులం కంటే అత‌డి ప్ర‌తిభ హార్డ్ వర్క్ గురించి తెలుసుకునేందుకే ఆస‌క్తిగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. మునుముందు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ లో రాజ‌మౌళి మ‌రిన్ని సంచ‌ల‌నాల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా కుల‌మ‌తాల‌తో సంబంధం లేకుండా అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.