Begin typing your search above and press return to search.
డార్లింగ్ తో సినిమా ఎప్పుడు..జక్కన్న జవాబిదే!
By: Tupaki Desk | 14 April 2020 8:30 PM ISTరాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఎప్పుడైనా భారీ క్రేజ్ ఉంటుంది. వారి కాంబినేషన్ లో తెరకెక్కిన 'ఛత్రపతి'.. 'బాహుబలి' సినిమాలు ఎలాంటి ఘన విజయం సాధించాయో అందరికీ తెలుసు. 'ఛత్రపతి' తెలుగుకు మాత్రమే పరిమితం అయింది కానీ 'బాహుబలి' రెండు భాగాలు దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించాయి. కొన్ని ఇతరదేశాల్లో కూడా 'బాహుబలి' ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే మరోసారి వారిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ఉంటుంది?
ఈమధ్య ఒక బాలీవుడ్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళిని ఇదే ప్రశ్న అడిగితే ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. "వద్దు. మేమిద్దరం ఒకరినొకరు చాలా భరించాం. జోక్స్ పక్కన పెడితే.. ఒక మంచి సబ్జెక్టు ఉంటే తప్పనిసరిగా కలిసి పనిచేస్తాం" అంటూ క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి సరదాగా చెప్పినా అది నిజమే. ఎందుకంటే ఆయన ఇరవైనాలుగు గంటలూ పని గురించే ఆలోచిస్తాడు. ప్రభాస్ ఓ సరదా మనిషి. పైగా భోజన ప్రియుడు. డార్లింగ్ కోసం జక్కన్న డిజైన్ చేసే పాత్రల కోసం కఠినమైన డైట్ ఫాలో అవ్వాలి. పైగా గంటల తరబడి కసరత్తులు చేయాలి. అందుకే ఇద్దరికీ అసలు లంకె కుదరడమే ఓ పెద్ద వండర్. 'బాహుబలి' సినిమా కోసం ఐదేళ్లు కలిసి పని చేశారు కాబట్టి ఇద్దరికీ కాస్త గ్యాప్ అవసరమే.
రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో 'RRR' తెరకెక్కిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక పీరియడ్ లవ్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.