Begin typing your search above and press return to search.

అరవింద ఈవెంట్లో అందరి కళ్ళు వారిమీదే

By:  Tupaki Desk   |   3 Oct 2018 4:18 AM GMT
అరవింద ఈవెంట్లో అందరి కళ్ళు వారిమీదే
X
నిన్న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ తాజా చిత్రం 'అరవింద సమేత' ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఊహించినట్టే బెస్ట్ స్పీచ్ ఇచ్చాడు కానీ ఎమోషనల్ అయ్యాడు.. ఆ జెన్యూన్ ఎమోషన్ అందరిని కదిలించింది. ఎన్టీఆర్ ఫంక్షన్ లో హైలైట్ ఎప్పుడూ ఎన్టీఆరే.. అందులో మరో ఆర్గ్యుమెంట్ లేదు.. మరి ఎన్టీఆర్ తర్వాత అందరినీ ఆకట్టుకున్నదెవరు?

గురూజీ త్రివిక్రమ్ అనో.. కళ్యాణ్ రామ్.. జగ్గూ భాయ్... ఇలా మీరు చాలా పేర్లు చెప్పే అవకాశం ఉంది కానీ వారెవరూ కాదు. అక్కడ ఈవెంట్ లో అందరి కళ్ళు రాజమౌళి తనయుడు కార్తికేయ.. రాజమౌళికి కాబోయే కోడలు పూజల మీదే. ఇద్దరూ జంటగా కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ అటెన్షన్ అంతా తమవైపు తిప్పుకున్నారు. రాజమౌళి కుటుంబం అంతా ఎన్టీఆర్ కు చాలా సన్నిహితంగా ఉంటారని తెలిసిందే. ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ ఈవెంట్ కు అయినా రాజమౌళి ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు హాజరవుతారు. ఈ సారి పూజ - కార్తికేయ జంట ఆ బాధ్యత తీసుకుంది.

ఈమధ్యనే ఎంగేజ్మెంట్ అయిన ఈ జంట డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. అప్పటి వరకూ టాలీవుడ్ లో వీరు ఫంక్షన్ కి హాజరయినా అందరి దృష్టి వీరి మీదనే ఉంటుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ చూడముచ్చటగా ఉన్నారు కదా?