Begin typing your search above and press return to search.

ఇప్పుడు రాజమౌళి కొడుకు రివ్యూ!!

By:  Tupaki Desk   |   23 Nov 2016 4:58 AM GMT
ఇప్పుడు రాజమౌళి కొడుకు రివ్యూ!!
X
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి పెట్టే ట్వీట్స్ కు బోలెడంత విలువ ఉంటుంది. సినీ ప్రేమికుల్లో ఆయన అభిప్రాయాలపై బోలెడంత గౌరవం ఉంటుంది. అసలా మూవీ గురించి ఏం తెలియకపోయినా.. జక్కన్న ఓ ట్వీట్ పెట్టాడంటే క్రేజ్ వచ్చేస్తుంది. ఇక రివ్యూ వస్తే మాత్రం ఆ మూవీ సూపర్ హిట్ కిందే లెక్క. రాజమౌళి రివ్యూలకు ఈ రేంజ్ వాల్యూ ఉంటే.. ఇప్పుడు ఆయన కొడుకు కార్తికేయ కూడా ట్వీట్స్ తో రివ్యూ రాసేశాడు.

'నా పుట్టిన రోజును ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో ముగించా. చాలా నచ్చింది. స్టోరీ సెలక్షన్ లో తన మెచ్యూరిటినీ నిఖిల్ మరోసారి చూపించాడు. మొత్తం ముగ్గురు నటీమణులు ఇరగదీసేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్లాస్ గా ఉంది. డైరెక్టర్ వీఐ ఆనంద్ కు... ఆయన రైటింగ్ కు సలాం చేయాల్సిందే. ఎల్లప్పుడూ నా ఫేవరెట్ యాక్టర్ వెన్నెల కిషోర్ భయ్యా అయితే.. చంపేశాడంతే.. నువ్వు తోపు మామా. "హేయ్.. నీకేమన్నా పిచ్చా.. కేరళ ఎందుకు వెళ్లావ్" ' అంటూ మూవీ చూసిన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు రాజమౌళి కొడుకు ఎస్.ఎస్.కార్తికేయ.

మరి ఇప్పటికే రివ్యూలు ఇవ్వడంలో రాజమౌళికి బోలెడంత పేరుంది. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా ఇచ్చేస్తున్నాడు. సో.. ఇక నుంచి ఇలాంటివి మరిన్ని ఎక్స్ పెక్ట్ చేసేయచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/