Begin typing your search above and press return to search.

రాజమౌళి అన్న.. అసలా నంబరేంటి?

By:  Tupaki Desk   |   4 Feb 2017 5:38 AM GMT
రాజమౌళి అన్న.. అసలా నంబరేంటి?
X
రాజమౌళి కుటుంబం టాలెంట్‌కి కేరాఫ్ అడ్రస్. శివశక్తి దత్తా (కీరవాణి తండ్రి) మొదలుపెడితే విజయేంద్ర ప్రసాద్ - కీరవాణి - రాజమౌళి - శ్రీవల్లి - రమా రాజమౌళి.. ఇలా ప్రతి ఒక్కరూ టాలెంటెడే. ఐతే పైన చెప్పుకున్న వాళ్ల పేర్లు పాపులర్ అయినంతగా ఎస్.ఎస్.కాంచి పేరు పాపులర్ కాలేదు. ‘మర్యాద రామన్న’కు కథ అందించినా.. ‘అమృతం’ లాంటి సీరియళ్లతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించినా.. కాంచి గురించి పూర్తిగా జనాలకు తెలియలేదు. ఇప్పుడు తన అసలు టాలెంట్ ఏంటో చూపించడానికి కాంచి రెడీ అవతున్నాడు. అతడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం.. ‘షో టైం’.

ఆ మధ్య వెరైటీ టీజర్‌ తో జనాల్ని ఆకర్షించిన కాంచి.. లేటెస్టుగా ట్రైలర్ వదిలాడు. అది చాలా వెరైటీగా ఉండి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక ఈ చిత్రం టైటిల్స్‌లో ‘డైరెక్టెడ్ బై కాంచి 5497’ అని పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాంచి పేరు వెనుక ఆ నంబర్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. నిన్న ‘షో టైం’ ఆడియో వేడుకలో అందరినీ ఈ ప్రశ్నే తొలిచి వేసింది. ఆడియో వేడుక చివర్లో యాంకర్ సుమ కూడా క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ 5497 ఏంటి అని కాంచిని అడిగేసింది. దానికి కాంచి బదులిస్తూ.. ‘‘అప్పట్లో ట్విట్టర్ అకౌంటుకి ఉత్త పేరు సరిపోకుంటే నాలుగు నంబర్లు జోడించాను. ఇప్పుడు దర్శకుడిగా నా తొలి సినిమాకు అదే నంబర్ ఉంటే బాగుంటుందని జోడించా. నాకు ట్విట్టర్లో 16 వేల మంది దాకా ఫాలోవర్లున్నాయి. ఈ నంబర్‌ తో నా పేరును చూసి గుర్తుపట్టి ఆ 16 వేల మందైనా నా సినిమా చూస్తారులే అని ఒక ఆశ’’ అంటూ చమత్కరించాడు కాంచి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/