Begin typing your search above and press return to search.

శ్రుతి బ్రెయిన్ లెస్ కామెంట్‌

By:  Tupaki Desk   |   2 Oct 2015 3:30 PM GMT
శ్రుతి బ్రెయిన్ లెస్ కామెంట్‌
X
మూడు భాష‌ల్లో క్ష‌ణం తీరిక లేకుండా న‌టిస్తున్న బిజీ నాయిక శ్రుతిహాస‌న్‌. ఈ అమ్మ‌డు న‌టించిన లేటెస్ట్ ఫిలిం పులి బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంద‌న్న టాక్ కోలీవుడ్‌ లో వినిపిస్తోంది. అయితే ఇదే విష‌య‌మై శ్రుతిహాస‌న్‌ నే అడిగితే ఈవిడ ఏమందో తెలుసా? సినిమాల్ని జ‌డ్డి చేయ‌డంలో నేను చాలా పూర్‌. అయినా నా సినిమాల్లో బ్రెయిన్ లెస్ కామెడీ ఫిలిం వెల్ కం బ్యాక్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎందుకు అంత పెద్ద స‌క్సెసైందో నాకు ఇప్ప‌టికీ అర్థం కాదు. 100 కోట్లు పైగా వ‌సూలు చేసింది. ఆడుతుంది అనుకున్న సినిమా ఆడ‌ని సంద‌ర్భాలెన్నో నా కెరీర్‌ లో చూశాను. అందువ‌ల్ల సినిమాల్ని జ‌డ్జి చేయ‌డంలో నేను ప‌ర‌మ వీక్ .. అంటూ అస‌లు మ్యాట‌ర్ మాట్లాడ‌కుండా త‌ప్పించుకుంది.

ఇప్పుడు పులి ఎందుకు ఫెయిలైంది? అన్న దానికి సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా ఈ అమ్మ‌డు ఇలా డొంక తిరుగుడు స‌మాధానం చెప్ప‌డ‌మేంటి? అని అభిమానులే ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. వెల్‌కం బ్యాక్ సినిమాని బ్రెయిన్ లెస్ అని తిట్టేసింది కాబ‌ట్టి ... మీడియా త‌న‌ని ఏం అన్నా ప‌ట్టించుకోను అని సూటిగా చెప్పేసింది కాబ‌ట్టి .. ఇక చేసేదేం లేదు? అయితే శ్రుతిహాస‌న్ ఇటీవ‌లి కాలంలో ఎంపిక చేసుకుంటున్న సినిమాల‌న్నీ బ్రెయిన్‌ లెస్‌ గా ఎంపిక చేసుకున్న‌వే.. కాలం క‌లిసొచ్చి ఇలా హిట్లొచ్చేస్తున్నాయ‌ని భావించాలేమో?ట్విట్ట‌ర్‌ లో మ‌హేష్‌ ని మించి ఈ అమ్మ‌డిని ఫాలో చేస్తున్నారు. 30 ల‌క్ష‌ల మంది బ్రెయిన్ లెస్ ఫ్యాన్స్‌.. అనేస్తుందేమో?