Begin typing your search above and press return to search.

అప్పట్లో ఫీలయిందట.. ఇప్పుడు లైట్ అంటోంది!

By:  Tupaki Desk   |   15 July 2019 7:00 AM IST
అప్పట్లో ఫీలయిందట.. ఇప్పుడు లైట్ అంటోంది!
X
కెరీర్ లో ఎత్తుపల్లాలు రెండూ చూసిన శృతి హాసన్ కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన సింగింగ్ కెరీర్ పై ఫోకస్ చేసింది. అంతే కాదు బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో చెట్టపట్టాలేసుకొని తిరుగుతూ ఇక నెక్స్ట్ స్టాప్ మ్యారేజ్ అన్నట్టుగా వ్యవహరించారు. అయితే ఇద్దరి బ్రేకప్ అయిపొయింది. ఇప్పుడు శృతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది.

సినిమాలకు దూరంగా ఉన్న దశలో శృతి వెయిట్ గురించి.. మైఖేల్ కోర్సలేతో లవ్ ఎఫైర్ గురించి ట్రోలింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో శృతి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడిందట. అందుకే అప్పట్లో "శృతి లావుగా ఉందే" అనే కామెంట్స్ తనను ఇబ్బంది పెట్టాయట. కానీ ఇప్పుడు మాత్రం తనపై ట్రోలింగ్.. కామెంట్స్ ను అసలు పట్టించుకోవడంలేదని చెప్పింది. తన కెరీర్ పై మాత్రమే ఫోకస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.

శృతి ప్రస్తుతం తమిళంలో 'లాబం' అనే సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరో. హిందీలో 'పవర్' అనే చిత్రంలో కూడా నటిస్తోంది. తెలుగులో రవితేజ సినిమాలో ఎంపికయిందని టాక్ ఉంది.