Begin typing your search above and press return to search.

2018లో శృతి హాసన్‌ పెళ్ళి

By:  Tupaki Desk   |   15 Jan 2016 11:34 AM IST
2018లో శృతి హాసన్‌ పెళ్ళి
X
కమల్ హాసన్ కూతురిగానే కాకుండా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది శృతిహాసన్. ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరు అనే స్థాయికి కూడా చేరుకుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో ఒకే ఏడాది వంద కోట్లు కొల్లగొట్టిన సినిమాల్లో నటించి, తన స్టామినా కూడా ప్రూవ్ చేసుకుంది. మరి శృతి హాసన్ పెళ్లెప్పుడు అనే ప్రశ్నకు ఇప్పుడు ఆమె సమక్షంలోనే ఓ ఆన్సర్ దొరికింది.

కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను పేరుతో ఓ తెలుగు ఛానల్ లో ఒక కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ ప్రోగ్రాంకి శృతి గెస్ట్ గా వచ్చిన సమయంలో.. ఆమె జాతకం చూసి చెప్పాడు ఒక వ్యక్తి. శృతి కెరీర్ మంచి జోష్ తో సాగుతుందని.. అలాగే 2017 చివర్లో కానీ, 2018 ప్రారంభంలో కానీ ఆమె పెళ్లి ఓ బిజినెస్ మ్యాగ్నెట్ తో అవుతుందని వివరించాడు. అంతే కాదు.. ఆమె భర్త ఓ విదేశీయుడని కూడా జాతకంలో తేల్చేశారు. వీటికి అవునని, కాదనీ ఏదీ సమాధానం చెప్పలేదు ఈ భామ.

నిజానికి శృతి హాసన్ పేరు అఫైర్స్ లో ఇంతకు ముందు చాలాసార్లే వినిపించింది. మొదట క్రికెటర్ సురేష్ రైనాతో ఈమెకు రిలేషన్ ఉందన్నారు. ఏడాదిన్నరపాటు చెట్టాపట్టాలేసుకుని కూడా తిరిగారు. ఆ తర్వాత హీరో సిద్ధార్ధతో వ్యవహారం కొన్నాళ్లు నడిచింది. సిద్ధూ-శృతిలు చెన్నైలో సహజీవనం కూడా చేశారంటారు. ఆ తర్వాత పెళ్లి అంటే మాత్రం ఆమడ దూరం అంటుంది శృతి హాసన్. అసలు పెళ్లే చేసుకోనని, ఒక వేళ చేసుకుంటే.. అతగాడు తనకు నచ్చిన సాంబర్ రైస్ లా ఉండాలని చెప్పింది. మరి ఇంకో రెండేళ్లలో సాంబార్ లాంటి ఫారినర్ ఎవరు దిగొస్తారో కదా.