Begin typing your search above and press return to search.

హీరోయిన్ కాక‌పోతే ఆ యాప్ అంతు చూసేదాన్ని!

By:  Tupaki Desk   |   28 Feb 2022 5:23 AM GMT
హీరోయిన్ కాక‌పోతే ఆ యాప్ అంతు చూసేదాన్ని!
X
సోష‌ల్ మీడియాలో శ్రుతిహాస‌న్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా..ట్విట‌ర్ ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. సినిమా విష‌యాల‌తో పాటు..వ్య‌క్తిగ‌త విష‌యాల్ని సైతం షేర్ చేస్తుంటుంది. తండ్రి క‌మ‌ల్ హాస‌న్ లానే సాంకేతికంగాను ఎక్కువ విష‌యాలు తెలుసుకోవ‌డానికి ఆరాట‌ప‌డుతుంది.

వీలైనంత అడ్వాన్స్ డ్ గా ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంది. అయితే ఈ బ్యూటీ హీరోయిన్ అవ్వ‌డం వ‌ల్ల ఓ యాప్ బ్ర‌తికి బ‌ట్ట‌క‌ట్టింది. లేదంటే ఆ యాప్ సంగ‌తేంటో తెల్చేసేదాన్ని అని శ్రుతిహాస‌న్ అంటోంది. ఇంత‌కీ ఆ యాప్ ఏంటి? ఆ యాప్ పై శ్రుతి హాస‌న్ అంత‌గా ఎందుకు ఆసక్తి చూపిస్తుందో తెలియాలంటే అస‌లు సంగ‌తి లోకి వెళ్లాల్సిందే.

అదే డేటింగ్ యాప్స్ . ఈ యాప్ పీచ‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్లికాని యువ‌తీ..యువ‌కులు ఈ యాప్ ని ఓ రేంజ్ లో వినియోగిస్తున్నారు. త‌మ స‌ర‌దాల‌న్నింటిని డేటింగ్ యాప్స్ తీరుస్తున్నాయి. కొంద‌రికి మంచి టైంపాస్ యాప్ కూడా.

అయితే అన్ని యాప్ ల‌ని విచ్చ‌ల‌విడిగా వినియోగిస్తున్నా..శ్రుతి హాస‌న్ డేటింగ్ యాప్ ని మాత్రం వాడ‌లేక‌పోతుందిట‌. త‌న స్నేహితులు డేటింగ్ యాప్ ని వాడుతున్నారు. ఎడ‌మ‌..కుడివైపుల‌కు స్పైప్ చేస్తూ..వ్య‌క్తుల్ని తిర‌స‌ర్కించ‌డం..అంగీక‌రించ‌డం చేస్తున్నారు. బ్ల‌యిండ్ డేట్స్ కూడా వెళ్తున్నారు. కానీ నేను మాత్రం ఆ ప‌నిచేయ‌లేక‌పోతున్నా.

నేను సెల‌బ్రిటీని కావ‌డం వ‌ల్ల ఇన్ని తిప్ప‌లు వ‌చ్చాయి. లేదంటే నేను కూడా వాళ్ల‌లా ఎంచ‌క్కా అన్నిర‌కాల మూవ్ మెంట్స్ ఆస్వాదించేదాన్ని. హీరోయిన్ గా పెద్ద‌గా ఫేమ‌స్ కాక‌పోయినా డేటింగ్ యాప్ ని వాడేదాన్ని . కానీ నేను ఇలాంటి యాప్ ల్లోకి ఎంట‌ర్ అయితే ఎలా ఉంటుందో కూడా తెలుసు.

అందుకే ధైర్యం చేయ‌లేక‌పోతున్నా. అయితే ఇలాంటి యాప్ ల్ని కొంత వ‌ర‌కే ప‌రిమితం చేస్తా. తొలుత న‌మ్మ‌ను. కేవ‌లం టైంపాస్ కోస‌మే వినియోగించేదాన్ని. అయినా ఓసారి ఫేక్ అకౌంట్ పెట్టి ట్రై చేస్తాన‌ని`` తెలిపింది.

ఇక శ్రుతిహాస‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే న‌టిగా ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న `స‌లార్` లో న‌టిస్తోంది. శ్రుతిహాసన్ తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. ఇప్ప‌టికే ఆమె పార్ట్ చిత్రీక‌ర‌ణ కూడా పూర్తిచేసింది.

భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో శ్రుతి మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. అలాగే మ‌రోవైపు న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంలో శ్రుతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరో అయిన బాల‌య్య స‌ర‌స‌న శ్రుతి క‌మిట్ మెంట్ ఒకింత ఆశ్చ‌ర్యానికి గురిచేసే అంశ‌మే.

ఇంకా కోలీవుడ్ లో మ‌రో రెండు ..మూడు చిత్రాల‌కు సంత‌కం చేసింది. బాలీవుడ్ లోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇప్ప‌టికే హిందీలో కొన్ని సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే.