Begin typing your search above and press return to search.

తమిళ్ పొన్నును తనివితీరా చూడాల్సిందే

By:  Tupaki Desk   |   16 Oct 2015 4:39 AM GMT
తమిళ్ పొన్నును తనివితీరా చూడాల్సిందే
X
శృతిహాసన్ ని ఏ యాంగిల్ చూసినా అందచందాలే కనిపిస్తాయి. అలాంటిది లేటెస్ట్ ఫ్యాషన్ చిట్టిపొట్టి డ్రస్సులేసి.. అన్ని యాంగిల్స్ లోనూ చూపించేస్తే ఎలా ఉంటుంది ? ఫ్యాన్స్ శృతి తప్పిపోరూ.

పైన కనిపిస్తున్న స్టిల్స్ అన్నీ ఈ అందాల భామ ఒక పాటకోసం వేసినవే. ఫ్యాన్స్ ముద్దుగా తల అని పిలుచుకునే తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ వేదాలం చిత్రంలోనివే పైన కనిపిస్తున్న శృతిహాసన్ ఫోటోలన్నీ. డోంట్ యూ మెస్ మీ అంటూ సాగే ఫాస్ట్ బీట్ లో రెచ్చిపోయింది శృతిహాసన్. జూక్ బాక్స్ ఇచ్చిన ఫోటో బేస్డ్ ఆడియో సాంగ్ లో శృతి అందాలను ఫోటోలతో చూపిస్తూ టీజ్ చేశారు వేదాలం టీం.

ఓ సెక్సీ కాప్ ఫోజు, మరోసారి సింగర్ గెటప్, ఇంకోసారి టెంప్టింగ్ టైట్ ఫిట్స్... ఇప్పటికైతే శృతిహాసన్ అందాలను ఇలాగే చూసి ఎంజాయ్ చేయాలి. లేదా తమిళ్ అయినా పర్వాలేదనుకుంటే నవంబర్ 4న వస్తాడు అజిత్. తెలుగులో ఇప్పట్లో కష్టమే లెండి. ఇక్కడ డైరెక్ట్ మూవీలకే డేట్స్ లేక చస్తుంటే.. డబ్బింగ్ కి ఛాన్స్ ఎక్కడనుంచి వస్తుంది?