Begin typing your search above and press return to search.

మజ్ను టీం అప్పుడే టూర్లు బయల్దేరారు

By:  Tupaki Desk   |   24 Jan 2016 12:09 PM IST
మజ్ను టీం అప్పుడే టూర్లు బయల్దేరారు
X
అక్కినేని హీరో నాగ చైతన్య ఇప్పుడు ముగ్గురు భామలతో కలిసి చిందులేయబోతున్నాడు. మూడు వేరియేషన్స్ గల రోల్ ని మజ్నులో చేస్తున్నాడు. ఇందులో చైతు కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు.. లెక్చరర్ తో ప్రేమలో పడతాడు. ఆ లెక్చరర్ రోల్ లో శృతి హాసన్ కనిపంచనున్న విషయం తెలిసిందే. మరి లెక్చరర్ అయితే.. ఇక్కడ డాక్టర్ గెటప్ లో కనిపిస్తోందేంటీ అనుకుంటున్నారా?

అసలు విషయం అదే. కాలేజ్ అన్నాక టూర్లు సహజమే కదా. అలా ఓసారి ఇండస్ట్రియల్ టూర్ కి వెళతారన్న మాట. ఆ సందర్భంగా ఓ ల్యాబ్ ని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ సందర్భంలోనే ఇలా డాక్టర్ గెటప్పుల్లో ల్యాబ్ లో చక్కర్లు కొడతారన్న మాట. ఈ మూవీలో శృతికి కొలీగ్ గా నర్రా శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఈ భామను ప్రేమించే కేరక్టర్ అట. సినిమా అంతా శృతికి లైన్ వేస్తూ ఉంటాడట ఈ కమెడియన్. బ్రహ్మాజీ కూడా మరో కొలీగ్ గా చేస్తున్నాడు. వీరందరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్.. థియేటర్లలో నవ్వులు పూయించనున్నాయంటున్నారు.

సినిమాకి సంబంధించి ఈ ఇండస్ట్రియల్ టూర్ చాలా కీలకంగా తెలుస్తోంది. స్టోరీలో కీలక మలుపు వచ్చే సందర్భం ఇది అంటున్నారు. ఇక మజ్నులో శృతి హాసన్ దాదాపు డీగ్లామర్ గా నటించనుండడం విశేషం.