Begin typing your search above and press return to search.

అమ్మడు పాములు చూస్తే వణికిపోతుందట...!

By:  Tupaki Desk   |   19 July 2020 10:00 PM IST
అమ్మడు పాములు చూస్తే వణికిపోతుందట...!
X
స్టార్ హీరో కమల్ హాసన్ - సారిక దంపతుల గారాలపట్టి శృతి హాసన్ 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో 'ఓ మై ఫ్రెండ్' 'బలుపు' 'ఎవడు' 'గబ్బర్ సింగ్' 'రేసుగుర్రం' 'శ్రీమంతుడు' 'ప్రేమమ్' సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. మహేష్ బాబు, రవితేజ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్... 'కాటమరాయుడు' మూవీ తర్వాత తెలుగులో కనిపించలేదు. అయితే దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత మాస్ మహారాజా హీరోగా నటిస్తున్న 'క్రాక్' సినిమాతో శృతి మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉండగా శృతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంభందించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. పర్సనల్ విషయాలు కూడా డేర్ గా షేర్ చేసే శృతి హాసన్ ఇటీవల పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు పాములు అంటే చాలా భయమని చెప్పుకొచ్చింది. సైన్స్ పరిభాషలో పాములకు లేదా సరీసృపాలకి భయపడటాన్ని ఓఫిడిఫోబియా అంటారు. ఇప్పటికీ ఓఫిడిఫోబియా నుండి బయట పడలేకపోతున్నానని వెల్లడించింది. అయినా పర్సనల్ విషయాలు కూడా ఆలోచించకుండా షేర్ చేసుకోవడం శృతికే చెల్లిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే శృతి హిందీలో విద్యుత్ జమాల్ - అమిత్ షాద్ లతో కలిసి నటించిన ''యారా'' జూలై 30న జీ 5 ఓటీటీలో రిలీజ్ కానుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న ''లాభమ్'' అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు శృతి హాసన్. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ''వకీల్ సాబ్'' చిత్రంలోనూ నటించనున్న విషయం తెలిసిందే.